ఒక్కసారి పార్టీని వీడిన వారిని తిరిగి పార్టీలోకి చేర్చుకోబోమని ప్రకటించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో ఐదో రోజు కొనసాగుతున్న ప్రజాగోస – బీజేపీ భరోసా యాత్రలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు… ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అవినీతి చిట్టాలతో బ్లాక్‌మెయిల్ చేసి పార్టీలో చేర్చుకున్నారని పేర్కొన్నారు.. అవినీతి అక్రమాలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేరాఫ్ అడ్రస్ గా మారారని విమర్శించారు.. ఎమ్మెల్యే వారి అనుచరులు అవినీతికి పాల్పడితే చూసి చూడనట్లు వ్యవహరించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.. రాష్ట్రంలో భారీ వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లితే సీఎం కేసీఆర్.. ఏరియల్ సర్వే కె పరిమితం అయ్యారని మండిపడ్డారు.. పంట నష్టపోయిన రైతులకు ఆదుకునే దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Shivshankar Wife Protest: నిత్య పెళ్ళికొడుకు సొంతూళ్ళో భార్య ఝాన్సీ నిరసన
ఇక, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి, గెలుపు గుర్రాలకు మాత్రమె ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారని స్పష్టం చేసిన ఆయన.. పార్టీని వీడిన వారిని తిరిగి పార్టీలోకి చేర్చుకోబోమని స్పష్టం చేశారు.. వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని వ్యాఖ్యానించారు రాజా సింగ్. కాగా, వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. ఇతర పార్టీలకు చెందిన నేతలను పార్టీలో చేర్చుకోవడంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.. తాజాగా, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీలో చేరగా.. త్వరలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా చేరతారనే ప్రచారం సాగుతోంది.. మరోవైపు.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు చాలా మంది తమతో టచ్‌లో ఉన్నారని చెబుతున్నారు బీజేపీ నేతలు.