Kedarnath: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కేదార్‌నాథ్ వార్తల్లో నిలిచింది. ఓ పూజారి చేసిన ఆరోపణలు ఇప్పుడు ప్రకంపనలు రేపుతున్నాయి. ఉత్తరాఖండ్ లో వెలిసి కేదార్‌నాథ్ దేవాలయంలోని గోడలకు స్వర్ణతాపనంలో రూ. 125 కోట్ల కుంభకోణం జరిగిందని ఆలయ సీనియర్ పూజారి సంతోష్ త్రివేది సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణల్ని బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ ఆదివారం కొట్టిపారేసింది. సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించేందుకు రాజకీయ కుట్రలో ఈ ప్రచారం సాగుతోందని ఆరోపించింది.
Read Also: Maharashtra: బ్లాక్‌మెయిల్ చేస్తూ.. మూడు నెలలుగా 18 ఏళ్ల యువతిపై అత్యాచారం..
మహారాష్ట్రకు చెందిన ఓ దాత గుర్భగుడిలో గోడలకు బంగారంతో తాపనం చేయించాడు. పూజారి ఓ వీడియోలో మాట్లాడుతూ.. ఆలయ గర్భగుడిలో గోడలను బంగారు రేకులతో కప్పతున్నట్లు చెప్పి, ఇత్తడి పలకలు వాడారని తీవ్ర ఆరోపణలు చేశారు. తీర్థ్ పురోహిత్ మహా పంచాయత్ కు ఉపాధ్యక్షుడిగానూ ఉన్న సంతోష్ త్రివేది ఈ కుంభకోణంలో ఉన్న వ్యక్తులపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన దిగుతామని హెచ్చరించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ మాట్లాడుతూ.. కేదార్‌నాథ్ లో ప్రధాని మోడీ హయాంలో జరిగిన అభివృద్ధిని జరిగిందని, భక్తుల సంఖ్య కూడా పెరిగిందని, ఇది చూసి తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.