JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం అస్సాంలోని శివసాగర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. యూపీఏ పాలనపై మండిపడ్డారు. భారత దేశం 2014 ముందు ఎలా ఉంది.. 2014 తర్వాత ఎలా ఉంది. దేశంలో భారీ మార్పులు కనిపిస్తున్నాయంటూ ఆయన అన్నారు. 2014కి ముందు భారతదేశం ఒక అవినీతి పీడిత దేశంగా ఉందని ఆరోపించారు. అంతేకాకుండా 2014కి ముందు కాంగ్రెస్ హయాంలో చాలా స్కాంలు జరిగినట్లు నడ్డా పేర్కొన్నారు.
Read Also: Groundwater Pumping: “భూమి భ్రమణ అక్షాన్ని” మారుస్తున్న భూగర్భ జలాల వినియోగం..
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ బహిరంగ సభలు నిర్వహిస్తోంది. గత యుపిఎ హయాంలో “తాము భారతదేశానికి సంబంధించిన రెండు విభిన్న చిత్రాలను చూస్తున్నామన్నారు. గత 9 సంవత్సరాలకు ముందు ఒకటి ఆ తరువాత మరొకటని తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సాధించిన విజయాలను జాబితా చేస్తూ, గత 9 సంవత్సరాలుగా ప్రధాని మోడీ దేశాన్ని అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ప్రయత్నించారని నడ్డా అన్నారు.
Read Also: Virendra Sachdeva: మహిళల భద్రత పేరుతో కేజ్రీవాల్ ప్రభుత్వం 800 కోట్ల కుంభకోణానికి పాల్పడింది
2014 నుండి ప్రధాని మోడీ నాయకత్వంలో ఒక బలమైన, నిర్ణయాత్మక ప్రభుత్వం ఉందన్నట్లు నడ్డా తెలిపారు. మోడీ ఆధ్వర్యంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తున్న ప్రభుత్వంగా నడ్డా అభివర్ణించారు. అంతేకాకుండా భారత్‌ను బలమైన దేశంగా మార్చేందుకు ప్రధాని కృషి చేశారని పేర్కొన్నారు. దేశానికి కొత్త శక్తిని, చైతన్యాన్ని నింపారు, దానిని ఆకాంక్షించేలా చేశారని నడ్డా తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం పెద్ద పురోగతి సాధించింది” అని నడ్డా అన్నారు. ఈ రోజు భారతదేశం స్థాయి పెరుగుతున్నందున ప్రపంచ దేశాలు ఇండియాను గౌరవంగా చూస్తున్నారని తెలిపారు. 2014 నుంచి 2022 మధ్య కాలంలో కేవలం మౌలిక సదుపాయాల కోసమే రూ.18 లక్షల కోట్లు వెచ్చించామని.. దాంతో దేశాభివృద్ధికి ఊతమిచ్చినట్లు బీజేపీ జాతీయ చీఫ్ అన్నారు. ఈ ఏడాది మరిన్ని మౌలిక వసతుల కల్పనకు రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేస్తామన్నారు.