Summer Effect: దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి ప్రతాపానికి జనాలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం 9 నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రతతో జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో జనాలు సతమతమవుతున్నారు. అయితే ఎండల ప్రభావం మనుషులపైనే కాకుండా రైలు పట్టాలపై ప్రభావం చూపింది. ఎండల వేడిమికి రైలు పట్టాలే కరిగిపోయాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని నిగోహన్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది.
Read Also: Poonam Bajwa : అదిరిపోయే అందాలతో రెచ్చగొడుతున్న పూనమ్ బజ్వా..!!
నిగోహన్ రైల్వే స్టేషన్‌లో లూప్ లైన్‌లోని రైల్వే ట్రాక్స్ ఎండలకు కరిగిపోయాయి. శనివారం ఎండ తీవత్ర ఎక్కువగా ఉండటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఆ ట్రాక్స్ మీదుగా వెళుతున్న రైలు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. అటుగా వస్తున్న నిలాంచల్ ఎక్స్‌ప్రెస్ నిగోహన్ రైల్వే స్టేషన్‌లో మెయిన్ లైన్ కాకుండా లూప్ లైన్‌లోకి వెళ్లింది. శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ట్రైన్ లూప్ లైన్‌లోకి వెళ్లగా.. అక్కడ ఎండలతో తీవ్రంగా వేడెక్కి ఉన్న పట్టాలు కరిగిపోవడం మొదలైంది. ఫలితంగా ఆ పట్టాలు వెడల్పుగా మారాయి.
Read Also: Vishaka Murder: విశాఖ జిల్లాలో దారుణం.. ఫోన్‌చేసి పిలిచి మహిళ ప్రైవేట్ పార్ట్స్ కోసేశాడు!
మరోవైపు రైల్వే ట్రాక్ వెడల్పుగా మారుతుండటంతో రైలు చక్రాలు పట్టాలు తప్పేందుకు సిద్ధంగా ఉన్నది. దీంతో గమనించిన లోకో పైలట్ వెంటనే ట్రైన్‌ను నిలిపేశాడు. ఆ తర్వాత కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందిచాడు. దీంతో వెంటనే ఇంజినీరింగ్ సెక్షన్ ఉద్యోగులు అక్కడికి చేరుకుని సమస్యను గుర్తించి.. ట్రాక్ రిపేర్ చేశారు. ఆ తర్వాత లక్నో జంక్షన్ చేరుకున్న లోకో పైలట్ ఈ ఘటన గురించి పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. సమాచారాన్ని అందించగా.. రైల్వే డిపార్ట్‌మెంట్ సీనియర్ అధికారులు, ఉద్యోగులు డ్యామేజీ అయిన ట్రాక్స్‌ను పరిశీలించారు. రిపేర్ చేయాలని వెంటనే ఆదేశాలు జారీ చేశారు. అయితే ట్రాక్‌లను సరిగ్గా మెయింటెయిన్ చేయని కారణంగా ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని లక్నో డివిజనల్ రైల్వే మేనేజర్ సురేశ్ సప్రా తెలిపారు. అంతేకాకుండా నిగోహన్ రైల్వే స్టేషన్‌లో వేరే ట్రైన్‌లు ఆగి ఉండటం వల్ల నిలాంచల్ ఎక్స్‌ప్రెస్ లూప్ లైన్‌లోకి వెళ్లిందని వివరించారు. ఈ మరోవైపు లూప్ లైన్‌ను వినియోగించకుండా స్టేషన్ మాస్టర్‌ను అలర్ట్ చేశారు.