Fish Farming: దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో చేపల పెంపకం మంచి ఆదాయ వనరుగా మారింది. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు చేపల పెంపకం ద్వారా తమ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. మధ్యప్రదేశ్ లోని నర్సింగపూర్ జిల్లా జమునియాకు చెందిన చింటూ సింగ్ సిలావత్ తన పొలంలో చేపల పెంపకం చేస్తూ ఏటా రూ.2.50 లక్షల వరకు మంచి లాభం పొందుతున్నాడు. చింటూ సింగ్ సిలావత్ గతంలో సంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేసేవాడు. ఆ తర్వాత బయోఫ్లాక్ టెక్నాలజీతో తన పొలంలో గుండ్రని ట్యాంకులు తయారు చేసి చేపల పెంపకం ప్రారంభించాడు. దీనివల్ల ఏటా రూ.2.50 లక్షల లాభం వస్తోంది.
Read Also: Comedian Sudhakar: చిరంజీవితో గొడవలు.. కాంట్రవర్సీ చేయకండి
బయోఫ్లాక్ టెక్నాలజీతో చింటూసింగ్ తన పొలంలో గుండ్రని ట్యాంకులు తయారు చేసి చేపల పెంపకం చేయాలనే ఆలోచన వచ్చింది. తన పొలంలో తక్కువ స్థలంలో గుండ్రంగా ట్యాంకు తయారు చేసి చేపల పెంపకం చేస్తున్నాడు. దీంతో సంప్రదాయ వ్యవసాయం ద్వారా ఆయన ఆదాయం 10 రెట్లు పెరిగింది. ప్రస్తుతం, గ్రామంలోని ఇతర ప్రజలు కూడా చింటూ సింగ్ నుండి ప్రేరణ పొందారు. అంతేకాకుండా వారి పొలాల్లో చేపల పెంపకం ద్వారా మంచి లాభాలు పొందుతున్నారు.
Read Also: Amit Shah: ఆయన ముఖ్యమంత్రా..? కేజ్రీవాల్‌కి పైలెట్‌గా పనిచేస్తున్నారా..?
చింటూసింగ్ బయోఫ్లోక్ టెక్నాలజీతో చేపల పెంపకం పనులను కలెక్టర్ శ్రీమతి రిజుబఫ్నా పరిశీలించారు. అనంతరం ప్రభుత్వం నుంచి 7 లక్షల రుణాన్ని కలెక్టర్ ఆ రైతుకు అందించారు. 2020కి ముందు, చింటూ సింగ్ సిలావత్ తన 3 ఎకరాల పొలంలో ఏడాది పాటు కష్టపడి 25 నుండి 30 వేల రూపాయల వార్షిక ఆదాయాన్ని పొందగలిగే వాడు. ఇప్పుడు చేపల పెంపకం ఆలోచన వచ్చిన తరువాత, అతను మత్స్య శాఖ నుండి బయోఫ్లోక్ టెక్నాలజీ గురించి సమాచారాన్ని తీసుకుని.. ఫంగస్ మరియు టిలాపియా జాతుల చేపలను పెంచుతున్నాడు. కేవలం చేపల పెంపకం ద్వారానే కాకుండా.. ఫౌల్ట్రీ ఫారం ద్వారా కూడా ప్రతి నెలా రూ.30 నుంచి 40 వేల వరకు ఆదాయం పొందుతున్నట్లు చింటూ సింగ్ సిలావత్ తెలిపాడు.