* నేడు కరీంనగర్ జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి గంగుల కమలాకర్.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంచినీళ్ల పండుగలో పాల్గొననున్న మంత్రి
* నేడు కరీంనగర్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన.. కరీంనగర్ రూరల్ మండలం బద్దీపల్లిలో టిఫిన్ బైటక్‌లో పాల్గొననున్న బండి సంజయ్.. మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా వివిధ వర్గాల ప్రముఖులు, ప్రజలను కలవనున్న బండి సంజయ్
* నేడు సంగారెడ్డి జిల్లాలో కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల పర్యటన.. మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా జిల్లాలో పర్యటించనున్న కేంద్రమంత్రి
* నేడు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉదయం 10 గంటలకి ప్రెస్‌మీట్.. గత నాలుగు రోజులుగా పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలకి కౌంటర్
* కాకినాడ: వారాహి యాత్రలో భాగంగా నేడు సర్పవరం జంక్షన్‌లో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ
* అనంతపురం : ఈనెల 20న బీజేపీ బహిరంగ సభ.. హాజరు కానున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
* కడప: నేడు నగరంలో రాయలసీమ సమస్యలపై రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఛైర్మెన్ బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో ఛలో ఢిల్లీ సన్నాహక సమావేశం
* ఏలూరులో బీజేపీ ఆధ్వర్యంలో బహిరంగ సభ.. హాజరుకానున్న రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, మాజీ ఎంపీ సుజన చౌదరి.. కేంద్రంలో మోడీ పరిపాలన 9 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా సభ