ఉత్తరప్రదేశ్ లో నిషాద్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, యోగి క్యాబినెట్ మంత్రి డాక్టర్. సంజయ్ కుమార్ నిషాద్ తన కమ్యూనిటీ కోసం ప్రధాని నరేంద్ర మోదీకి రక్తంతో లేఖ రాశారు. తన జీవితాంతం మత్స్యకారుల సమాజానికి అంకితమై ఉంటానని లేఖలో పేర్కొన్నారు. మచ్చువా సర్వహిత్ మరియు నిషాద్ పార్టీతో కలిసి తన ఏకైక తీర్మానం అని చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తన సోదరిని అతి దారుణంగా హత్య చేశాడు. అంతేకాకుండా తలను చేతిలో పట్టుకుని రోడ్డుపైకి వచ్చాడు. తలను చేతిలో పట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. చూసిన వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
కర్ణాటక ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ భారతదేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యే అని ఓ నివేదిక వెల్లడించింది. డీకే శివకుమార్ ఆస్తుల విలువ రూ.1,413 కోట్లు అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (న్యూ) నివేదిక పేర్కొంది.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అధికారికంగా ప్రకటించనప్పటికీ.. రాజకీయ ఎత్తుగడలు మాత్రం మొదలయ్యాయి. అధికారాన్ని నిలుపుకునేందుకు బీజేపీ పాకులాడుతుండగా.. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. అందుకోసం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల సమరంలో జోరుమీదున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ.. శుక్రవారం గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో పర్యటించనున్నారు.
సచిన్ తో ప్రేమలో పడి.. నేపాల్ మీదుగా ఇండియాలోకి వచ్చిన సీమా హైదర్ కేసులో ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. సీమా ప్రేమికురాలేనా.. లేదా పాకిస్థాన్ గూఢచారా అనే అనుమానాలు తావెత్తుతున్నాయి. సీమా హైదర్ ని ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ మరియు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.
ముంబై నుంచి అమృత్‌సర్ వెళ్తున్న గోల్డెన్ టెంపుల్ రైలులో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో పోలీసు బలగాలు అలర్ట్ అయ్యారు. వారి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు.
గుజరాత్ లో వర్షాలు బాగా కురుస్తున్నాయి. నేడు గుజరాత్ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. కొన్ని గంటల్లోనే 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజ్‌కోట్, సూరత్, గిర్ సోమనాథ్ జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరదల దాటికి కాలనీల్లో నిలిచి ఉన్న కార్లు మునిగిపోయాయి.
ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలోని నమామి గంగే ప్రాజెక్టు వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అలకనంద నది ఒడ్డున ఉన్న ప్రాజెక్ట్ సైట్లోని ట్రాన్స్ఫార్మర్లో పేలుడు సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంపై సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారణకు ఆదేశించారు.