Parliament Monsoon Session: ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) కూటమి సిద్ధమైంది. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు నుంచే మణిపూర్‌తో సహా పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీల కొత్త కూటమి ముట్టడిస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లోని ఒక వ్యవసాయ క్షేత్రంలో IAF విమానానికి చెందిన ఇంధన ట్యాంక్‌లను పోలీసులు గుర్తించారు. వాటిని శిక్షణ కోసం వాడుతామని.. ఆ యుద్ధ విమానాలు తమవే అంటూ భారత వైమానిక దళం తెలిపింది.
విపక్ష ఎమ్మెల్యేలకు నిధుల కేటాయింపుపై మహారాష్ట్రలో దుమారం చెలరేగుతుంది. సోమవారం ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎమ్మెల్యేలు నిధుల కేటాయింపులో విభేదాలపై ఏకనాథ్ షిండే ప్రభుత్వంపై దాడికి దిగాయి వీరితో పాటు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఎదురుదాడికి దిగడం గమన్హారం.
పశ్చిమ బెంగాల్ లో రెండు వేర్వేరు చోట్ల విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. శివుడికి మొక్కుబడి ఉందని గంగాజలం కోసమని వెళ్లి ముగ్గురు యువకులు నదిలో మునిగిపోయారు. అసన్‌సోల్‌లో జరిగిన ఘటనలో ఒకరు గల్లంతు కాగా.. ముర్షిదాబాద్‌లోని బహరంపూర్‌లో జరిగిన ఘటనలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.
మణిపూర్ లో హింసాకాండ ఆగడం లేదు. మరోసారి కాల్పులకు పాల్పడ్డారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటనలో ఒక పాఠశాల, పది ఇళ్లకు నిప్పు పెట్టడంతో దగ్ధమయ్యాయి.
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఓ దారుణ ఘటన చోటు చోటుచేసుకుంది. తన ఇంటికి వచ్చిన ఓ వ్యక్తిని యువకుడు గొడ్డలితో నరికి చంపాడు. కొడుకుకి, తల్లికి మధ్య గొడవ జరుగుతుండగా.. దాన్ని పరిష్కరించేందుకు వచ్చిన వ్యక్తిని కిరాతకంగా చంపాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
భారీ వర్షాల కారణంగా కాశ్మీర్‌లోని చాలా జిల్లాల్లో చెరువులు, కుంటలు, నదుల నీటిమట్టం పెరిగి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. జమ్మూ కాశ్మీర్‌లో జూలై 20 నుండి నిరంతరంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శ్రీనగర్ శివార్లతో సహా అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి.
ఛత్తీస్ ఘడ్ లో ఓ తెగకు చెందిన ప్రజలు తమ ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. వారు తమ కూతుళ్లకు పెళ్లి చేస్తే.. డబ్బు, నగలు కట్నంగా ఇవ్వరంట. పాములను కట్నంగా ఇస్తారట..