ఆగ్రాలోనూ యమునా తన భీకర రూపం దాల్చుతుంది. మరోవైపు యమునా నది నీటిమట్టంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే యమునా నీటి మట్టం అనేక ప్రాంతాలను తాకింది. యమునా నది నీరు కూడా తాజ్ మహల్ కాంప్లెక్స్ సరిహద్దు దగ్గరకు చేరుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో ఓ యువకుడు తన ప్రియురాలిని గొంతుకోసి హత్య చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. కేవలం 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి వివరాలను బయటపెట్టారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సహరాన్‌పూర్ బైపాస్ హైవే రాంపూర్ మణిహారన్ సమీపంలోని ఛాలెంజ్ గేట్ సమీపంలోని వంతెన వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో నలుగురు సజీవ దహనమయ్యారు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జనాలు ఇప్పుడు సగం ధరకే టమోటాలు పొందనున్నారు. వారికి మొబైల్ వ్యాన్‌ల ద్వారా ఈ సదుపాయం అందించింది అక్కడి ప్రభుత్వం. లక్నో మేయర్ సుష్మా ఖార్క్వాల్ అధ్యక్షతన ఈ కార్యక్రమం ప్రారంభమైంది. భారత ప్రభుత్వ సహకారంతో నేషనల్ కన్స్యూమర్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌సిసిఎఫ్‌ఐ) ద్వారా.. లక్నోలోని 11 చోట్ల టమాటోలను మొబైల్ వ్యాన్‌లలో కిలో రూ.80కి ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు.
మహారాష్ట్రలోని పూణెలో వరుస వేధింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు అనూప్ వానీగా గుర్తించారు. లిఫ్ట్ ఇస్తానని చెప్పి అమ్మాయిలను వేధించేవాడని పోలీసులు తెలిపారు. దాదాపు 18 మంది బాలికలను వేధించాడని వారు పేర్కొన్నారు.