Seema Haider: సీమా హైదర్ కేసులో ఊహించని ట్విస్టులు.. విచారిస్తున్న యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సచిన్ తో ప్రేమలో పడి.. నేపాల్ మీదుగా ఇండియాలోకి వచ్చిన సీమా హైదర్ కేసులో ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. సీమా ప్రేమికురాలేనా.. లేదా పాకిస్థాన్ గూఢచారా అనే అనుమానాలు తావెత్తుతున్నాయి. సీమా హైదర్ ని ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ మరియు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సీమా.. పాక్ ఐఎస్ఐ ఏజెంట్ ఏమో అన్న అనుమానాలు బలపడుతున్నాయి. మరోవైపు ఆమె సోదరుడు పాకిస్తాన్ ఆర్మీలో చేరాడని.. కానీ అతను మిలటరీలో కొనసాగుతున్నాడో లేదో తనకు తెలియదని సీమా వెల్లడించింది. సీమా స్టేట్మెంట్లు నిర్ధారించుకునేందుకు అధికారులు.. ఆమె భర్త గులాం హైదర్ ను విచారించారు.
Lifestyle : పచ్చని కాపురానికి పనికొచ్చే సూత్రాలు..అవేంటంటే?
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
మరోవైపు సచిన్ తో ప్రేమ విషయాలకు సంబంధించి.. సీమా హైదర్ అన్నీ చెప్పింది. 2019లో తన భర్త గులాం హైదర్ నుండి దూరంగా ఉన్నప్పుడు.. అదే సమయంలో సచిన్ మీనాతో స్నేహం ఏర్పడిందని చెప్పింది. తనకు సచిన్ అంటే చాలా ఇష్టమని, అందుకే పాకిస్థాన్ నుంచి దుబాయ్, అక్కడి నుంచి నేపాల్, ఇప్పుడు నోయిడాకు వచ్చానని సీమా హైదర్ చెప్పింది. యూపీ ఏటీఎస్ విచారణలో సీమా హైదర్ పలు ప్రశ్నలకు సమాధానం చెప్పింది. పాకిస్థాన్ సైన్యంలో తన బంధువులు ఉండడం.. అంతగా చదువుకోకపోయినా హిందీ, ఇంగ్లీష్ లో మాట్లాడడం.. నేపాల్ నుంచి అక్రమంగా భారత్ రావడం ఇలా అన్ని ప్రశ్నలపై సీమా తప్పించుకునే సమాధానాలు చెప్పింది. అంతేకాకుండా సచిన్ సీమకు చెందిన నకిలీ ఆధార్ కార్డులను తయారు చేశాడని.. వారిద్దరూ బస చేసిన నేపాల్‌లోని హోటల్‌లో తప్పుడు పేరు మరియు చిరునామాను ఇచ్చాడని కూడా తేలింది. దీంతో విచారణలో ఇరువురు విషయాలు దాచిపెట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Tamannah : మరోసారి ఆ స్టార్ హీరోతో కలిసి నటించబోతున్న తమన్నా..?
అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన వారిపై చర్యలు తీసుకుంటారా లేదా పాకిస్థాన్‌కు తిరిగి పంపిస్తారా అనే విషయాలపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. వారిద్దరిని విచారించిన ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ తన నివేదికను సిద్ధం చేసింది. సీమా, సచిన్‌లను సుమారు 20 గంటలపాటు విచారించిన తర్వాత ఏటీఎస్ తన నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో సీమా హైదర్‌ను పాకిస్థాన్‌కు తిరిగి పంపించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై యుపి పోలీసు ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. ఇది రెండు దేశాల విషయమని, తగిన ఆధారాలు లభించే వరకు ఏమీ చెప్పలేమని అన్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!