ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గంగా ఎక్స్‌ప్రెస్‌వే కోసం తవ్విన గుంతల్లో పడి నలుగురు చిన్నారులు మృతిచెందారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని నలుగురి మృతదేహాలను నీటిలో నుంచి బయటకు తీశారు. మృతి చెందిన పిల్లలను చూసి చిన్నారుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఈ చిన్నారులు మేకల మేత కోసం వెళ్లినట్లు బంధువులు తెలిపారు. చనిపోయిన పిల్లలందరూ దాదాపు 10 ఏళ్లలోపు వారే ఉన్నారు. మృతిచెందిన చిన్నారుల్లో.. అజ్మత్, సద్దాం, ఖుష్‌నుమా, ముస్తాకీమ్ ఉన్నారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గుంతలో నుంచి చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు.
Rains Effect: జీహెచ్‌ఎంసీ పరిధిలోని కార్యాలయాలు, విద్యాసంస్థలకు 2 రోజులు సెలవు
ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ ద్వారా విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా మెజిస్ట్రేట్, పోలీసు సూపరింటెండెంట్, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలన్నింటిని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టంకు తరలించినట్లు పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. మరోవైపు హర్దోయ్ జిల్లా మేజిస్ట్రేట్ మంగళ ప్రసాద్ సింగ్ మాట్లాడుతూ.. ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం కోసం యుపిడిఎ మైనింగ్ చేసిందని తెలిపారు. వర్షపు నీరు చేరడంతో అందులో లోతైన నీరు నిలిచిందని.. గొయ్యి నీటిలో మునిగి చిన్నారులు మృతి చెందిన ఘటన విషాదకరమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సూచనల మేరకు ఆర్థిక సాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు.