Uttar Pradesh: యూపీలో దారుణం.. సోదరి తలతో రోడ్డుపైకి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తన సోదరిని అతి దారుణంగా హత్య చేశాడు. అంతేకాకుండా తలను చేతిలో పట్టుకుని రోడ్డుపైకి వచ్చాడు. తలను చేతిలో పట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. చూసిన వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అది చూసిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఆ యువకుడి కోసం వెతుకులాట ప్రారంభించగా.. దారిలో పోలీసుల కంటబడ్డాడు. దీంతో ఆ యువకుడు.. తాను లొంగిపోయేందుకు పోలీస్ స్టేషన్‌కు వస్తున్నానని పోలీసులకు తెలిపాడు.
Mamata Banerjee Home: ఆయుధాలతో మమతా బెనర్జీ ఇంట్లోకి ప్రవేశించేందుకు యత్నం.. నిందితుడు అరెస్ట్
Also Read
- Supreme Court: CJI సూర్యకాంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సంజయ్ రౌత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..
- Dharmendra Pradhan: ‘‘బంగ్లాదేశ్ నుంచి స్పూర్తి’’.. రాహుల్ గాంధీ, సీజేపీపై ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్..!
- Petrol and Diesel Price Hike: పెట్రోల్ ధరలపై షాకింగ్ న్యూస్.. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ హెచ్చరిక.. వడ్డీ రేట్లకూ రెక్కలు?
- Congress: ‘‘ప్రభుత్వ మార్పే మా లక్ష్యం’’.. స్పష్టం చేసిన కాంగ్రెస్..
అసలు విషయానికొస్తే.. ఈ షాకింగ్ ఘటన ఫతేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిత్వారా గ్రామంలో జరిగింది. రియాజ్ అనే వ్యక్తి తన సోదరి ఆషిఫాతో ఏదో విషయమై వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన రియాజ్ ఇంట్లోని కత్తితో ఆషిఫా తల నరికాడు. ఆ తర్వాత రియాజ్ ఆ తలను తీసుకుని ధైర్యంగా రోడ్డుపైకి వచ్చాడు. రోడ్డుపై సుమారు కిలోమీటరు మేర అందరూ చూస్తుండగానే.. నడుచుకుంటూ వెళ్లాడు. అయితే అతన్ని చూసిన జనాలు అతడిని పట్టుకునేందుకు సాహసించలేదు.
MP Arvind: బీజేపీని వాడుకుని వెళ్లిపోతే.. వాళ్లను జుట్టు పట్టుకుని లాక్కొస్తాం..
అయితే గ్రామానికి చెందిన చాంద్‌బాబు అనే వ్యక్తితో ఆషిఫాకు అక్రమ సంబంధం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. చాంద్ బాబును పెళ్లి చేసుకోవద్దని ఆషిఫాకు రియాజ్ పదే పదే చెప్పాడు.. అయినా ఆమే వినలేదు. దీంతో కోపాద్రిక్తుడైన రియాజ్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- brother
- Cut
- head
- national news
- Road
తాజావార్తలు
-
Supreme Court: CJI సూర్యకాంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సంజయ్ రౌత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..
-
ORR Arbitration : సుప్రీంకోర్టులో HMDAకి షాక్.. ORR కేసులో కీలక మలుపు
-
Indian Cinema: ఇండియన్ సినిమాకు పట్టిన ఈ ‘బడ్జెట్ పిచ్చి’ ఎవరిని ముంచుతుంది?
-
Ranabaali Box Office: ‘రణబాలి’ సేఫ్ కావాలంటే అన్ని కోట్లు కొల్లగొట్టాల్సిందేనా?
-
Gopichand: ఆ హీరో కమ్‌బ్యాక్‌కు రిలీజ్ డేట్ల గ్రహణం!
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!