ఓ కార్మికుడు రైల్వే వంతెనపై ఉన్న పట్టాలపై పనిచేస్తుండగా సడన్ గా రైలు రావడంతో.. అతను ప్రాణాలు రక్షించుకునేందుకు భారీ సాహసం చేశాడు. ముందు రైలు దూసుకొస్తుంది.. పక్కకు వెళ్దామంటే నది ప్రవహిస్తుంది. అతను చేసేదేమీ లేకుండా వెంటనే కిందనున్న నదిలోకి దూకాడు. ఈ ఘటన బీహార్ లోని సహర్సా జిల్లాలో జరిగింది.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ఓ ప్రైవేట్ యూనివర్శిటీ ప్రాంగణంలోకి పులి ప్రవేశించింది. అందుకు సంబంధించిన వీడియో సీసీటీవీ ఫుటేజీలో రికార్డు కావడంతో విషయం బయటపడింది.
బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ డియో అర్థాంతరంగా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు బెంచ్ కోర్టు హాలులోనే వెల్లడించారు. ఆత్మగౌరవం విషయంలో రాజీపడలేనని చెప్పి రాజీనామా ప్రకటించారు.