* ఉదయం 11 గంటలకు గద్దర్ అంతిమయాత్ర ప్రారంభం.. మొదట గన్‌పార్క్ దగ్గర నుంచి, అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి అల్వాల్ వరకు అంతిమయాత్ర
* ప్రకాశం: త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
* బాపట్ల: చీరాలలో 9వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ర్యాలీ.. హాజరుకానున్న జాయింట్ కలెక్టర్ శ్రీధర్
* నెల్లూరు జిల్లా: పొదలకూరు మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
* తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లా పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం రద్దు
* ఏలూరు జిల్లా లో సీఎం జగన్ పర్యటన.. గోమ్ముగుడెంలో వరద బాధితులను పరామర్శించనున్న సీఎం.. వరద బాధితులతో సమావేశం అనంతరం తిరిగి రాజమండ్రి వెళ్ళనున్న సీఎం
* నేడు గుంటూరు అమరావతి రోడ్డులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మీయ సమావేశం.. కార్యక్రమానికి హాజరుకానున్న జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్
* పల్నాడు: ఎడ్లపాడులోని పాత మసీదు, రజక కాలనీ ప్రాంతాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి విడుదల రజిని
* బాపట్ల: వేమూరు మండలం పోతుమర్రు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున
* నేడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో, కలెక్టరేట్లు, పోలీస్ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం.. బాధితుల నుండి అర్జీలు స్వీకరించనున్న ఉన్నతాధికారులు
* అల్లూరి జిల్లా: నేడు విలీన మండలాల్లో పర్యటించనున్న సీఎం జగన్.. కూనవరం బస్టాండు సెంటర్ వద్ద వరద బాధిత కుటుంబాలను కలిసి, సమస్యలు అడిగి తెలుసుకోనున్న జగన్