హర్యానాలో హింసాకాండ ఆగడం లేదు. రెండు వర్గాల మధ్య ఘర్షణ చిలికి చిలికి పెద్ద దుమారం రేగింది. అల్లర్లకు కేంద్ర స్థానమైన నుహ్ జిల్లాలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ హింసలో ఇప్పటివరకు ఐదుగురు మరణించగా.. 30 మందికి గాయాలయ్యాయి.
దేశంలో జీఎస్టీ వసూళ్ల సంఖ్యలు నెల నెలకు పెరుగుతూ వస్తున్నాయి. జీఎస్టీ వల్ల ప్రభుత్వాలకు భారీ ఆదాయం చేకూరుతుంది. జూలై నెలలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 1.65 ట్రిలియన్ల జీఎస్టీ వసూలు చేశాయి.
ఓ యువకుడిని ఫేస్బుక్ మోసం చేసిన ఘటన పశ్చిమ బెంగాల్లో జరిగింది. ఫేస్బుక్లో పరిచయమైన ఇద్దరు యువతులతో ఓ యువకుడు చాటింగ్ చేశాడు. ఆ తర్వాత ఓ యువతి.. యువకుడిని ఫైవ్ స్టార్ హోటల్‌కు పిలిపించి అతని వద్ద ఉన్న వస్తువులన్నీ దోచుకుంది.
హర్యానాలోని నుహ్‌లో ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం 1 గంటలకు విశ్వహిందూ పరిషత్ కాషాయ యాత్ర చేపట్టింది. ఈ యాత్రలో కాల్పులు, రాళ్ల దాడి జరిగింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది. మధ్యాహ్నం ప్రారంభమైన దహనకాండ ఇప్పటికీ ఆగడం లేదు. రోడ్డుపై కాలిపోతున్న వాహనాలు, పొగలు ఇంకా దర్శనమిస్తున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు హోంగార్డులు మరణించగా, మరో ఇద్దరు పోలీసు అధికారులకు తీవ్రంగా గాయాలయ్యాయి.
గోవా విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు DRI అధికారులు. 12 కోట్ల విలువ చేసే 5.2 కేజీల హెరాయిన్ సీజ్ చేశారు. ఓ ప్రయాణికురాలు ఇథియోపియా నుండి హెరాయిన్ తీసుకొస్తుండగా గోవాలో పట్టుకున్నారు.
యూపీలోని ఫిరోజాబాద్‌లో కోచింగ్ ఆపరేటర్‌ను అనుమానాస్పద స్థితిలో హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. తుండ్ల-ఆగ్రా రహదారిలో రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న అతని కారులో మృతదేహం లభ్యమైంది. తలకు బుల్లెట్ గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.