* ప్రకాశం: త్రిపురాంతకం మండలం ముడివేములలో గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
* అంబేద్కర్ కోనసీమ: నేడు వరద ప్రభావిత లంక గ్రామాల్లో సీఎం జగన్ పర్యటన
* నెల్లూరు: మణిపూర్‌లో జరుగుతున్న సంఘటనలకు నిరసనగా నెల్లూరులో క్రైస్తవ సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన
* గుంటూరు: బ్రాడిపేటలో జనసైనికుల సర్వసభ్య సమావేశం.. హాజరుకానున్న పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్
* ఏలూరు: పోలవరంలో మంత్రి అంబటి రాంబాబు పర్యటన.. పోలవరం ప్రాజెక్టులోని వివిధ విభాగాల నిర్మాణ పనులను పరిశీలన.. సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్
* నంద్యాల: నేడు జూపాడుబంగ్లా (మం) పారుమంచాలలో ఇసుకవాగుపై వంతెన నిర్మాణానికి భూమి పూజ చేయనున్న మంత్రి బుగ్గన
* విశాఖ: నేడు జీవీఎంసీ దగ్గర తెలుగుదేశం పార్టీ మహాధర్నా.. వైసీపీ నాయకుల భూ అక్రమాలపై ఛార్జ్‌షీట్ విడుదల చేయనున్న టీడీపీ
* తూర్పు గోదావరి: ఉదయం ఆర్ & బీ గెస్ట్ హౌస్‌లో సీఎం జగన్ వరద సమీక్ష కార్యక్రమంలో పాల్గొననున్న హోం మంత్రి తానేటి వనిత
* విజయవాడ: నేడు విద్యుత్ ఉద్యోగుల వర్క్ టూ రూల్ ద్వారా నిరసన.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
* విజయవాడ: నేడు NIA కోర్టులో కోడి కత్తి కేసు విచారణ
* తిరుపతి: నేడు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం
* రాజన్నసిరిసిల్ల: వేములవాడ పట్టణంలో మంత్రి కేటీఆర్ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
* ఖమ్మం: నేడు పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలంలో అనుచరులతో సమావేశం కానున్న మాజీ మంత్రి తుమ్మల
* నేడు పాలేరు నియోజకవర్గంలోని రూరల్ మండలంలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన.. పొంగులేటి సమక్షంలో పలువురు కాంగ్రెస్‌లో చేరిక
* ఖమ్మం: నేడు ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ చేతుల మీదుగా బీసీ రుణాల పంపిణీ