చికెన్ కర్రీ అంటే లొట్టలేసుకుని తినే వారు చాలా మందే ఉన్నారు. ఇక ముఖ్యంగా ఏవైనా పండగలప్పుడు కంచంలో కోడి ముక్క లేనిది ముద్ద దిగదు. చికెన్ అంటే ఇష్టపడే వాళ్లు చాాలా మంది ఉన్నారు. అయితే తాజాగా చికెన్ ఇవ్వలేదని ఓ వ్యక్తిపై కొందరు యువకులు దాడి చేశారు. ఈ దాడి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. Read Also: Manipur: మణిపూర్ అల్లర్లు.. మరో 9 కేసులు విచారించనున్న…
స్వాతంత్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. నోయిడా, ఘజియాబాద్‌ల నుంచి ఢిల్లీ వైపు వచ్చే భారీ వాహనాల ప్రవేశంపై సోమవారం రాత్రి నుంచి ఆగస్టు 15 వరకు ఆంక్షలు ఉంటాయని, ఈ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లిస్తామని ఆదివారం ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు మధ్య విబేధాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే . చాలా సందర్భాల్లో ప్రశాంత్ కిషోర్ బీహార్ సీఎంపై విమర్శలు చేశారు. తాజాగా మరోసారి నితీశ్ కుమార్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ కిశోర్. నితీశ్ కుమార్ కేవలం 9వ తరగతి మాత్రమే చదివారన్నారు పీకే. ఇక ముందూ కూడా ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు బాధ్యత గల సీఎం పదవిలో ఉండి కూడా బీహార్‌లో…
చదివించి లెక్చరర్ చేస్తే.. కాళ్లను విరగ్గొట్టించింది ఓ భార్య. తనకు చదువు రాకుండా.. తన భార్య చదువుకుంటానంటే కష్టపడి చదివిస్తే.. చివరకు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బండాలో జరిగింది. తాను చదువుకునేందుకు మద్ధతిచ్చానని.. కానీ తన భార్య దాడి చేయడంపై ఆవేదన వ్యక్తం చేశాడు భర్త.
ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఆమె ఏ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయలేదు. 2019లో అధికారికంగా రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రియాంక ఉత్తరప్రదేశ్ తూర్పుకు AICC ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇదిలా వుండగా ప్రియాంకా గాంధీ రాజకీయ భవిష్యత్తుపై ఆమె భర్త రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభలో ఉండేందుకు ప్రియాంకకు అన్ని అర్హతలు ఉన్నాయని, ఆమెను లోక్ సభలో చూడాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.…
జనాభా పెరగకుండా ఉండటం కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తుంటారు. ఈ విషయంలో తమ టార్గెట్ ను పూర్తి చేయడం కోసం ఓ ఆశావర్కర్ దారుణానికి పాల్పడింది. పెన్షన్ ఇప్పిస్తానని ఒక మూగ యువకుడిని తీసుకువెళ్లి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించింది. అతని తల్లి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం బయటకు వచ్చింది. ఈ ఘటన ఒడిశాలో జరిగింది. వివరాల ప్రకారం గాంగదురువ అనే 26 యేళ్ల యువకుడు ఒడిశాలోని మత్తిలి సమితి మొహిపోధర్…
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశాల బాట పట్టనున్నారు. సెప్టెంబర్ లో విదేశాల్లో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు యూరప్ లో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
అవినీతికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి జీ-20 దేశాల సమిష్టి కృషి తోడ్పడుతుందనీ ప్రధాని మోడీ తెలిపారు. అంతేకాకుండా.. అవినీతికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ అనే కఠినమైన విధానం ఇండియాలో ఉందని జీ-20 సమావేశంలో ప్రధాని తెలిపారు.
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ బిల్లుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ను రాష్ట్రపతి భవన్ విడుదల చేసింది. దీంతో ఈ బిల్లు ఇప్పుడు చట్టంగా మారింది. ఇదే విషయంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో తెలిపారు. “DPDP చట్టంగా మారింది. రాష్ట్రపతి ఆమోదం తెలిపారు." అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.