* నెల్లూరు జిల్లా: పొదలకూరు మండలాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
* విశాఖ: నేడు గంగవరం పోర్టు నిర్వాసితుల పాదయాత్ర.. పెడగంట్యాడలోని నిరసన శిబిరం దగ్గర నుంచి పాతగాజువాక వరకు ర్యాలీ
* తూర్పు గోదావరి: నేడు క్విట్ ఇండియా స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ విధానాలపై కేంద్రకార్మిక సంఘాలు రాజమండ్రిలో మహాధర్నా
* నేడు రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్‌మీట్.. మెగాస్టార్ చిరంజీవి వైసీపీ ప్రభుత్వం, ప్రత్యేకహోదాపై చేసిన వ్యాఖ్యలపై స్పందించే అవకాశం
* విజయనగరం: నేడు పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు.. సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజిను సందర్శించి రైతులతో ముఖాముఖి.. ఓల్డ్ బస్‌స్టాండ్ జంక్షన్‌లో బహిరంగసభ
* పశ్చిమ గోదావరి: తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉండనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ.. సాయంత్రం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి హాజరు
* పార్వతీపురం మన్యం: ఈరోజు రాష్ట్రస్థాయి ప్రపంచ ఆదివాసీ సందర్భంగా సాలూరు డిగ్రీ కాలేజ్ ఆవరణలో ఆదివాసీ సంబరాలు.. హాజరుకానున్న డిప్యూటీ సీఎం రాజన్నదొర, మంత్రి గుడివాడ అమర్నాథ్
* నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్న ఇన్‌చార్జి మంత్రి ధర్మాన ప్రసాదరావు.. రెవెన్యూ కల్యాణ మండపంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి హాజరుకానున్న మంత్రి
* పల్నాడు: చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామంలో ఆరు కోట్లతో నిర్మించిన, రక్షిత మంచినీటి పథకాన్ని, ప్రారంభించనున్న మంత్రి విడదల రజిని
* నేడు తాడేపల్లిలో కళ్యాణమస్తు, షాదీ ముబారక్ కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున