రైల్వే కార్మికులు పట్టాలపై పనిచేస్తున్నప్పుడు వారికి ముందుగానే రైలు ఎప్పుడు వస్తుందనే సమాచారం తెలిసి ఉంటుంది. అంతేకాకుండా రైలు వచ్చే 10 నిమిషాల ముందే పట్టాల నుంచి పక్కకు వెళ్తారు. కానీ ఓ కార్మికుడు రైలు పట్టాలపై పనిచేస్తుండగా.. అకస్మాత్తుగా రైలు వచ్చింది. దీంతో అతను ఏం చేశాడంటే..
Bhola Shankar : ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సిద్ధమవుతున్న ‘భోళా శంకర్’
వివరాల్లోకి వెళ్తే.. ఓ కార్మికుడు రైల్వే వంతెనపై ఉన్న పట్టాలపై పనిచేస్తుండగా సడన్ గా రైలు రావడంతో.. అతను ప్రాణాలు రక్షించుకునేందుకు భారీ సాహసం చేశాడు. ముందు రైలు దూసుకొస్తుంది.. పక్కకు వెళ్దామంటే నది ప్రవహిస్తుంది. అతను చేసేదేమీ లేకుండా వెంటనే కిందనున్న నదిలోకి దూకాడు. ఈ ఘటన బీహార్ లోని సహర్సా జిల్లాలో జరిగింది. అశోక్ కుమార్ అనే కార్మికుడు రైల్వే వంతెనపై ఉన్న పట్టాలపై పనిలో నిమగ్నమై ఉండగా సడన్ గా రైలు రావడంతో.. ప్రాణాలు దక్కించుకునేందుకు భాగ్‌మతీ నదిలోకి దూకాడు.
Gaddar Passes Away LIVE UPDATES: ఎల్బీ స్టేడియంలో గద్దర్ పార్థివదేహం
ఆ వ్యక్తి నదిలో దూకడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఓ పెద్ద తాడును నదిలోకి విసిరి కార్మికుడు అశోక్‌ను రక్షించారు. మరోవైపు.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కార్మికుడిని ఆసుపత్రికి తరలించారు. ఆ కార్మికుడు ఓ ప్రైవేటు రైల్వే కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.