త్తీస్‌గఢ్‌లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. అంబికాపూర్‌లో నివసించే ఓ మహిళపై .. ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతకుముందు తన భర్తను హత్య చేసాడు. అనంతరం ఆ రక్తం మడుగుల్లో పడి ఉన్న మృతదేహం పక్కనే అతడి భార్యపై అత్యాచారం చేశాడు.
ఈనెల 6న ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని 508 రైల్వే స్టేషన్‌ల ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టునున్నారు. రూ.24,470 కోట్ల వ్యయంతో అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద కేంద్రం ఈ పనులకు చేపడుతోంది.
రాహుల్ గాంధీ పరువు నష్టం కేసు తీర్పుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. ట్విట్టర్ లో ప్రియాంక గాంధీ స్పందిస్తూ.. మూడు విషయాలను ఎక్కువ కాలం దాచలేము.. 'సూర్యుడు, చంద్రుడు, నిజం' అంటూ గౌతమ బుద్ధుడి కవితను సంధించారు.
మధ్య ప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో వరుసగా చీతాలు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే 8 చీతాలు మృతిచెందగా.. తాజాగా మరో చీతా కన్నుమూసింది. ఆ చీతా పేరు ధాత్రి. దాని ఆఫ్రికా నామధేయం తిబ్లిసి. అయితే కునో అభయారణ్యంలో చీతా చనిపోయి ఉండగా అధికారులు ఉదయం గుర్తించారు.
హర్యానాలోని నుహ్ హింసాత్మక ఘటనలో నష్టపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందజేస్తుందని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ప్రత్యేక పోర్టల్ ద్వారా బాధితులను గుర్తించి పరిహారం ఇస్తామని పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. శానిటైజర్ లో విషపదార్థాలు కలిపి ఓ విద్యార్థినికి తాగించి హత్య చేశాడు. అయితే అంతకుముందు విద్యార్థిని వెంటపడుతుండటంతో.. విద్యార్థిని పడొద్దు అని చెప్పింది. దీంతో ఈ దారుణ ఘటనకు పాల్పడ్డాడు.