ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో మూకుమ్మడి హత్య ఘటన వెలుగు చూసింది. దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో ఓ ఇంట్లోకి ప్రవేశించిన ముగ్గురు దొంగలను గ్రామస్థులు చితకబాదారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ఢిల్లీలోని జాతీయ ఆహార భద్రత కార్డుదారులకు ఇప్పుడు ఉచిత చక్కెర లభించనుంది. సోమవారం కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
కోల్‌కతాలో ముస్లిం మత పెద్దలతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హిందూ పుజారులు, ముస్లిం మత పెద్దలకు గుడ్ న్యూస్ చెప్పారు. వారి నెలవారీ జీత భత్యాన్ని రూ.500 పెంచుతున్నట్టు ప్రకటించారు.
లడఖ్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. సోమవారం ఖర్దుంగ్లా పాస్‌ను సందర్శించారు. అంతేకాకుండా తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పాంగాంగ్ సరస్సు వద్ద నివాళులర్పించారు. ఖర్దుంగ్లా ప్రాంతానికి రాహుల్ గాంధీ బైక్ పై వెళ్లారు.
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) కోసం టెక్నికల్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ కోసం ఇస్రో పరీక్ష నిర్వహించింది. అయితే ఇందులో హర్యానాకు చెందిన ఇద్దరు వ్యక్తులు మోసం చేసారని వారిని పోలీసులు అరెస్టు చేశారు.
మళ్లీ రాజ్యసభ సభ్యుడిగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో 9 మంది ఎంపీలు ఉన్నారు.
అస్సాంలోని తేయాకు తోటల్లో రాజరికంగా జీవించే అతి పెద్ద ఏనుగు బిజులీ ప్రసాద్ మృతి చెందింది. ఇది ఆసియాలోనే పెద్ద ఏనుగుగా చెబుతున్నారు. గంభీరంగా కనపడే ఆ ఏనుగు వయస్సు 89 సంవత్సరాలు ఉంటుందని చెబుతున్నారు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో సమాజ్వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్యపై ఓ యువకుడు షూ విసిరాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఎస్పీ కార్యకర్తలు నిందితుడిని పట్టుకుని తీవ్రంగా కొట్టారు.