ఉత్తరాఖండ్ లో వర్ష బీభత్సం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా అక్కడ ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీని వల్ల జన జీవనం అస్తవ్యస్తంగా తయారు అయ్యింది. అనేక మంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు భారీ వర్షాలు కురుస్తుంటంతో పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇప్పటికే చాలాచోట్ల కొండచరియలు విరిగిపడి కొంతమంది చనిపోగా.. మరికొందరు గల్లంతయ్యారు. తాజాగా కొండచరియలు విరిగిపడి ఇద్దరు మహిళలతో సహా 4 నెలల పసిపాప మృతి చెందింది.
Read Also: Upasana Konidela: అపోలో కొత్త బ్రాంచ్.. ఆమెకు గిఫ్ట్ అంటున్న మెగా కోడలు
ఈ ఘటన తెహ్రీ జిల్లాలోని చంబాలో జరిగింది. సోమవారం భారీ కొండచరియలు విరిగిపడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కొండచరియలు విరిగిపడిన శిథిలాల కింద కూరుకుపోయిన కారులో వారి మృతదేహాలు కనిపించాయని తెహ్రీ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నవనీత్ సింగ్ భుల్లర్ తెలిపారు. మరోవైపు ఈ ఘటనలో మరికొన్ని వాహనాలు కూడా చిక్కుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శిథిలాలను తొలగించేందుకు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని ఆయన చెప్పారు.
Read Also: Model Bikini Dress: మోడల్ మోడల్ బికినీ మోడల్.. హడల్ హడల్ ఎయిర్ పోర్ట్ సిబ్బంది..
మృతులను పూనమ్ ఖండూరి, సరస్వతీదేవి, నాలుగు నెలల కుమారుడుగా గుర్తించారు. కొండచరియలు విరిగిపడటంతో న్యూ తెహ్రీ-చంబా రహదారిపై వాహనాలను నిలిపివేశారు. సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర విపత్తు సహాయ దళం ఎక్స్‌కవేటర్ యంత్రాలను ఉపయోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు జిల్లా మేజిస్ట్రేట్ మయూర్ దీక్షిత్, ఎస్ఎస్పీ భుల్లర్, చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ మనీష్ కుమార్ సంఘటనా స్థలంలో ఉండి పర్యవేక్షణ పనులను పరిశీలిస్తున్నారు.