Fire Accident in train coach: తమిళనాడులోని మధురైలో శనివారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. లక్నో నుంచి రామేశ్వరం వెళ్తున్న రైలు టూరిస్ట్ కోచ్‌లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగగా 9 మంది మృతి చెందిన సంగతి విదితమే. ఈ ఘటనలో 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు కూడా. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు ప్రారంభించారు అధికారులు. అందులో భాగంగా తనిఖీలు నిర్వహించారు ఫోరెన్సిక్ నిపుణులు. ఈ దర్యాప్తులో…
దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు ప్రభుత్వం ప్రీమియం బాస్మతీ బియ్యం ముసుగులో తెలుపు బాస్మతీయేతర బియ్యం 'అక్రమ' ఎగుమతిని ఆపడానికి కేంద్రం కట్టడి చర్యలు ప్రారంభించింది.
స్కూల్ ఫీజు కట్టలేదని నేలపై కూర్చొని పరీక్ష రాయమన్నారు ప్రిన్సిపాల్. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటు చేసుకుంది. తమ కుమారుడికి స్కూల్ ఫీజు బాకీ ఉన్నందున నేలపై కూర్చోబెట్టి పరీక్షలు రాయమని ప్రిన్సిపాల్ ఒత్తిడి చేశారని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు.
బీహార్ లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. సమస్తిపూర్ సివిల్ కోర్టు ప్రాంగణం బుల్లెట్ల మోతతో మారుమోగింది. గుర్తుతెలియని దుండగులు పోలీసులకు బహిరంగ సవాల్ విసిరి ఇద్దరు ఖైదీలపై కాల్పులు జరిపారు.
మధురైలో జరిగిన రైలు ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. ప్రయాణికుల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని రైల్వేని కోరారు.
మధ్యప్రదేశ్ అమర్‌కంటక్‌లోని నర్మదా ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఒక సైన్ బోర్డు ఏర్పాటు చేశారు. అందులో స్త్రీలు, పురుషులు మంచి దుస్తులతో ఆలయ ప్రాంగణానికి రావాలని తెలిపారు. పొట్టి బట్టలు, హాఫ్ ప్యాంట్, బెర్ముడా, నైట్ సూట్, మినీ స్కర్ట్, చిరిగిన జీన్స్ మరియు క్రాప్ టాప్ వంటి దుస్తులు ధరించి వచ్చిన వారికి ఆలయంలోకి ప్రవేశం నిషేధించారు.
ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఢిల్లీలో ఒక సభలో ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి అస్వస్థతకు గురై.. అక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో ప్రధాని తన ప్రసంగాన్ని మధ్యలో ఆపేసి సహాయం చేయమని వైద్య బృందాన్ని కోరారు.
ఆగస్టు 28న బ్రిజ్ మండల్ ఆధ్వర్యంలో సర్వ్ జాతీయ హిందూ మహాపంచాయత్ 'శోభా యాత్ర' చేపట్టనున్నారు. దీంతో మతపరమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న నుహ్ జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్ మరియు బల్క్ SMS సేవలను ఆగస్టు 28 వరకు నిలిపివేయాలని హర్యానా ప్రభుత్వం శనివారం ఆదేశించింది.