అస్సాంలోని తేయాకు తోటల్లో రాజరికంగా జీవించే అతి పెద్ద ఏనుగు బిజులీ ప్రసాద్ మృతి చెందింది. ఇది ఆసియాలోనే పెద్ద ఏనుగుగా చెబుతున్నారు. గంభీరంగా కనపడే ఆ ఏనుగు వయస్సు 89 సంవత్సరాలు ఉంటుందని చెబుతున్నారు. ఆ ఏనుగు మృతికి గల కారణాలను ఓ వార్త సంస్థ తెలిపింది. వృద్ధాప్య సమస్యల కారణంగా బిజులీ ప్రసాద్ తెల్లవారుజామున 3.30 గంటలకు ది విలియమ్సన్ మాగోర్ గ్రూప్‌కు చెందిన బెహాలీ టీ ఎస్టేట్‌లో తుది శ్వాస విడిచినట్లు పేర్కొంది.
Bandi Sanjay : గజ్వేల్‌లో ఓడిపోతననే కేసీఆర్ కామారెడ్డికి పోతుండు
ఆ ఏనుగుకు ఇంగ్లండ్‌కు చెందిన మాస్టర్ ఆలివర్ సాహిబ్ ప్రసాద్ అని పేరు పెట్టారు. ఆ ఏనుగుతో సంబంధం ఉన్న జంతు ప్రేమికులు, తేయాకు తోటల కార్మికులు మరియు స్థానికులు బిజులీ మృతికి సంతాపం తెలిపారు. మరోవైపు ది విలియమ్సన్ మాగోర్ గ్రూప్ కు బిజులీ ప్రసాద్ ఉండటం గర్వకారణమన్నారు. ప్రారంభంలో బిజులీ ప్రసాద్ ను చిన్నదిగా ఉన్నప్పుడు తీసుకువచ్చారని తేయాకు తోటల్లో పనిచేసే ఒక అధికారి తెలిపారు
Ind Vs Pak: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ కు ఆ స్టార్ బ్యాటర్ దూరం..!
మరోవైపు పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రసిద్ధ ఏనుగు శస్త్రవైద్యుడు డాక్టర్ కుశాల్ కొన్వర్ శర్మ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. “నాకు తెలిసినంతవరకు, బిజులీ ప్రసాద్ భారతదేశంలోనే అత్యంత వయస్సున్న పెంపుడు ఏనుగు.” అని అన్నారు. సాధారణంగా అడవిలో ఉండే ఏనుగులు 62-65 సంవత్సరాల వరకు జీవిస్తాయని.. పెంపుడు ఏనుగులు సరైన సంరక్షణతో సుమారు 80 సంవత్సరాల వరకు జీవిస్తాయని ఆయన పేర్కొన్నారు.
Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
సుమారు 8-10 సంవత్సరాల క్రితం బిజులీ ప్రసాద్ పళ్ళన్నీ రాలిపోయాయి. దాంతో అది ఏమీ తినలేక చనిపోయే పరిస్థితికి చేరుకుందని జంతు వైద్యుడు శర్మ చెప్పారు. అయితే తాను అక్కడికి వెళ్లి ఏనుగుకు చికిత్స చేసానని.. అంతేకాకుండా అది తినే ఆహార పదార్థాలను మార్చినట్లు తెలిపారు. బియ్యం, సోయాబీన్ వంటి ఉడికించిన ఆహారాన్ని ఇవ్వాలని.. దాంతో అధిక ప్రోటీన్లు వల్ల ఏనుగు దీర్ఘాయువును పెంచింది అని డాక్టర్ శర్మ చెప్పారు.