హిమాచల్ ప్రదేశ్ ను వర్షాలు అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజా జల విలయాన్ని ‘రాష్ట్ర విపత్తు’గా ప్రకటిస్తున్నట్లు సీఎం సుఖ్వీందర్ సుఖు తెలిపారు.
కోటా విద్యా కేంద్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు అరికట్టడానికి నివారణ చర్యలు చేపట్టింది. కోటాలో అన్ని హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ (పీజీ) నివాసాల్లో స్ప్రింగ్‌లోడెడ్ ఫ్యాన్‌లను ఏర్పాటు చేశారు.
ఢిల్లీలో నెహ్రూ మొమోరియల్ మ్యూజియం పేరును పీఎం మ్యూజియంపై మార్చడంపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ స్పందించారు. అనంతరం మోడీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ రాజకీయ చరిత్ర నుంచి నెహ్రూ పేరును ఎవరు చెరిపేయలేరన్నారు. నెహ్రూ పేరు చిరస్థాయిగా ఉంటుందన్నారు. తాను చేసిన మంచిపనులతో నెహ్రూకు గుర్తింపు వచ్చిందని, నెహ్రూ అన్న పేరుతో కాదని రాహుల్ తెలిపారు.
ఉత్తర్రదేశ్ లోని బరేలీ నగరంలోని జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి సమీపంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. గురువారం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.
జమ్ముకశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో హిందూమతమే ఇస్లాం కంటే అతి పురాతనమైనదని తెలిపారు. ఈ దేశంలో పుట్టిన వారంతా తొలుత హిందువులేనని కీలక వ్యాఖ్యలు చేశారాయన.
ఓ బాలికను రేప్ చేసి జైలుకెళ్లిన కామాంధుడు.. జైలు శిక్ష అనుభవించి విడుదలై మళ్లీ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సత్నా జిల్లాలో చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం సత్నా జిల్లాలో మరో మైనర్ బాలికను రేప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు సాత్నాలోని కృష్ణా నగర్‌కు చెందిన రాకేష్ వర్మ (35)గా గుర్తించారు.