ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో ఆదివారం గుజరాత్‌కు చెందిన యాత్రికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోవడంతో ఏడుగురు మృతి చెందగా, 27 మంది గాయపడ్డారు. 35 మందితో ప్రయాణిస్తున్న బస్సు గంగోత్రి నుంచి తిరిగి వస్తుండగా గంగ్నాని వద్ద ప్రమాదానికి గురైంది.
పెరుగుతున్న ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ధరలను నియంత్రించడంతో పాటు సరఫరాను మెరుగుపరిచేందుకు వీలుగా ఉల్లి ఎగుమతులపై శనివారం 40శాతం సుంకాన్ని విధించిన సంగతి తెలిసిందే.
అరుణాచల్ ప్రదేశ్‌లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో పలు జిల్లాల్లో రవాణా సౌకర్యం నిలిచిపోయింది. ఇదిలా ఉండగా శనివారం సిజి వద్ద అకాజన్-లికాబాలి-ఆలో రహదారిపై కొండచరియలు విరిగిపడినట్లు ఓ అధికారి తెలిపారు.
సవాళ్ల సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను ఆశాకిరణంగా ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. ఈ సవాలు సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ ఆశాకిరణంలా ప్రకాశిస్తోందని ఆయన శనివారం అన్నారు.
ఉత్తరప్రదేశ్ లో వర్షాలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. భారీగా కురిసిన వర్షాలకు ఉన్నావ్‌లో వరదనీరు ముంచెత్తింది. అంతేకాకుండా.. డ్యామ్‌ల నుంచి నీటిని విడుదల చేయడంతో ఉన్నావ్ గ్రామం నీటిలో మునిగిపోయింది. మరోవైపు అక్కడి నివాసముండే ఇళ్లలోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జనాలు. అంతేకాకుండా.. రోడ్లు, కాలనీలు పూర్తిగా మునిగిపోయాయి. అక్కడి కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. అత్యవసరంగా ప్రజలు ఎక్కడికైనా వెళ్లాలంటే పడవల సహాయంతో వెళ్తున్నారు.
తోవాయి గ్రామంలో ముగ్గురు మృతి చెందిన ఘటనపై.. గిరిజనులు నిరసన చేపట్టారు. కుకీ-జో కమ్యూనిటీ ఆధిపత్యం ఉన్న కాంగ్‌పోక్పి జిల్లాలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వందలాది మంది మహిళలు నిన్న మధ్యాహ్నం నుంచి జాతీయ రహదారిపై ధర్నా చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా అక్కడ నిరసనలు కొనసాగుతున్నాయి.