Top Headlines at 1 PM on 05th February 2024, Top Headlines at 1 PM, Telangana, Andhrapradesh, Telugu News, Tollywood, National News, International News
Asaduddin Owaisi: ఇల్లాలిలో ఎలా నడుచుకోవాలనే విషయాన్ని వివరంగా చెప్పారు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. భార్యపై కోపం వెళ్లగక్కడం పౌరుషం అనిపించుకోదని, ఆమె కోపాన్ని తట్టుకోవడమే నిజమైన పౌరుషం అని అన్నారు. పార్టీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. భార్యలతో మగవారు మంచిగా నడుచుకోవాలని అన్నారు. ‘‘నేను ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాను. ఇది చాలా మందిని కలవరపెట్టింది. మీ భార్య మీ బట్టలు ఉతకాలి,
ఎక్కువ సీట్లు ఆశిస్తున్న పవన్ కళ్యాణ్: ఏపీలో రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ-జనసేన కూటమి రంగం సిద్ధం చేస్తోంది. ఎన్నికల సన్నద్ధతలో టీడీపీ-జనసేన మరింత వేగం పెంచుతోంది. త్వరలోనే సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై రెండుసార్లు భేటీ కాగా.. నేడు అమరావతిలో మరోసారి సమావేశం అయ్యారు. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై ఇద్దరు నేతలు కీలక చర్చలు…
తిరుమలలో నేడు రెండో రోజు ధార్మిక సదస్సును నిర్వహిస్తారు. ఈ సదస్సుకు 32 మంది స్వామీజీలు హాజరుకానున్నారు. సనాతన ధర్మంలో భాగంగా ఆధ్యాత్మిక భావవ్యాప్తి కోసం ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. పీఠాధిపతులు, మాఠాథిపతుల సూచనలు, సలహాలను తీసుకొని హిందూ ధర్మప్రచారం చేయనున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. దీని ద్వారా శ్రీవారి వైభవాన్ని, హైందవ సంస్కృతిని వ్యాప్తి చేసేందుకు తిరుమల ఓ మంచి వేదిక కాబోతుందని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు టీడీపీ వేద సదస్సును…
పేపర్ లీకేజీల సమస్యను పరిష్కరించే లక్ష్యంతో ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టనుంది. పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లు పేరుతో ప్రతిపాదిత చట్టం.. సెంట్రల్ ఏజెన్సీ పోటీ పరీక్షలు, విశ్వవిద్యాలయ పరీక్షలతో సహా వివిధ పరీక్షలలో అన్యాయమైన పద్ధతుల సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది.
కేంద్ర బడ్జెట్ తయారీ అనేది చాలా నెలల పాటు సాగే సుదీర్ఘమైన కసరత్తు. బడ్జెట్ సమర్పణ అనేది దేశం యొక్క ఆర్థిక పథాన్ని రూపొందించే, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే కీలకమైన సంఘటన. భారతదేశంలో బడ్జెట్ ప్రక్రియ చరిత్ర చాలా ఆసక్తికరమైనది. మొదటి కేంద్ర బడ్జెట్‌ను నవంబర్ 26, 1947న అప్పటి ఆర్థిక మంత్రి ఆర్‌కే షణ్ముఖం చెట్టి సమర్పించారు.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మంగళవారం నాడు 60 మందికి పైగా ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు ఓ బస్సు డ్రైవర్. ఆ వ్యక్తి బస్సును నడుపుతున్నప్పుడు అతనికి గుండెపోటు రాగా.. ఆ నొప్పితో కూడా బస్సును ఆపి బస్సులోని ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు
Pariksha Pe Charcha: పిల్లల రిపోర్ట్ కార్డ్స్ని తమ సొంత విజిటింగ్ కార్డుగా పరిగణించొద్దని ప్రధాని నరేంద్రమోడీ విద్యార్థుల తల్లిదండ్రులకు సలహా ఇచ్చారు. సోమవారం నిర్వహించిన ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో చర్చించారు. విద్యార్థులు ఇతరులతో కాకుండా తమతో తాము పోటీ పడాలని సూచించారు.