పశ్చిమ సరిహద్దులో సీమాంతర ఉగ్రవాదంపై భారతదేశం చాలా కాలంగా ఎదుర్కొంటున్న సవాలుకు ఇప్పుడు మరింత సరైన స్పందన లభిస్తోందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం అన్నారు.
Kolkata : ఇండిగో విమానం ల్యాండ్ అయ్యే ముందు పైలట్ కళ్లకు లేజర్ కిరణాలు తగిలిన విషయం వెలుగులోకి వచ్చింది. కోల్‌కతా విమానాశ్రయంలో విమానం ల్యాండింగ్‌కు కిలోమీటరు దూరంలో ఉండగా ఈ ఘటన జరిగింది.
Farmers Protest: పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)ని డిమాండ్ చేస్తూ రైతులు ‘ఢిల్లీ ఛలో’ మార్చ్‌కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు రైతులు దేశ రాజధానిని ముట్టడించాలని యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని హర్యానా-ఢిల్లీ బార్డర్‌లో అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు రైతులకు మధ్య వారం రోజులుగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎంఎస్‌పీతో సహా మొత్తం 12 డిమాండ్లను రైతు సంఘాలు కేంద్రం ముందుంచాయి.
Farmers protest: పంటలకు మద్దతుధర(ఎంఎస్‌పీ)తో సహా 12 హమీలను అమలు చేయాలని, కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు రైతులు ఆందోళన చేపట్టారు. ‘ఢిల్లీ ఛలో’పేరుతో మార్చ్ నిర్వహించారు. అయితే, వీరిని హర్యానా-ఢిల్లీ సరిహద్దుల్లోనే పోలీసులు, కేంద్ర బలగాలు అడ్డుకున్నాయి. మరోవైపు రైతులతో కేంద్ర మంత్రులు పలుమార్లు చర్చించారు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌కి చెందిన ఓ మహిళ ఒమన్ దేశంలో నరకయాతన పడుతోంది. బతుకుదెరువు కోసం అక్కడికి వెళ్లిన సదరు మహిళను యజమాని చిత్రహింసలు పెడుతున్నారు. బందీగా ఉంచుకుని, వేరే వారికి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ, తనను రక్షించాలని భారత ప్రభుత్వాన్ని వేడుకున్న మహిళ వీడియో వెలుగులోకి వచ్చింది. తన భార్యను ఒమన్ నుంచి కాపాడాలని మహిళ భర్త రాష్ట్ర పోలీసులను కోరాడు. ఆమెను విడిచిపెట్టేందుకు రూ. 2 లక్షలు- 3 లక్షలు కోరుతున్నట్లు జోగి ముఖేష్ అనే వ్యక్తి…