*అమరావతి: ఇవాళ ఉదయం 9 గంటలకు సమావేశం కానున్న ఏపీ అసెంబ్లీ.. పలు శాఖలకు సంబంధించిన నివేదికలను సభ ముందు పెట్టనున్న ప్రభుత్వం.. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం.. తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్న ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు.. ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ.. చర్చ అనంతరం సీఎం జగన్ సమాధానం.. సభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.. ఏపీ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు- 2024, ఏపీ అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు -2024.
*శాసన మండలి: ఇవాళ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు.. ఉదయం 10 గంటలకు సమావేశం కానున్న మండలి.. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం.. తీర్మానాన్ని మండలిలో ప్రవేశపెట్టనున్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్.. తీర్మానంపై చర్చ.
*డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేడు సర్పంచుల చలో అసెంబ్లీ ముట్టడి.. సర్పంచ్‌ల విధులు నిధులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఛలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టిన సర్పంచుల సంఘం.. అసెంబ్లీ ముట్టడికి వెళ్ళనివ్వకుండా సర్పంచులను ముందస్తు హౌస్ అరెస్టులు చేసిన పోలీసులు.. ఎట్టి పరిస్థితుల్లో వెళ్లి తీరుతామంటున్న సర్పంచులు.. జిల్లా వ్యాప్తంగా పలువురు సర్పంచులను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు..
*నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి మూలానక్షత్ర పూజలు
*నేడు జీడినెల్లూరులో చంద్రబాబు కదలి రా సభ.. బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం రామానాయుడు పల్లి వద్ద జరగనున్న రా..కదిలిరా సభ.. 20 ఎకరాలతో సభాస్థలి 30ఎకరాలతో పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు.
*విజయవాడ: నేడు వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ 20వ స్నాతకోత్సవం.. హాజరుకానున్న గవర్నర్ అబ్దుల్ నజీర్.
*నేడు దక్షిణ తెలంగాణలోని పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశం.. కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై చర్చ.
*సిద్దిపేట: నేడు సిద్దిపేట నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన.. నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి పొన్నం
*నేడు గోవాకు ప్రధాని మోడీ.. ఇండియా ఎనర్జీ వీక్‌ను ప్రారంభించనున్న ప్రధాని
*నేటి నుంచి రూ.29కే భారత్ రైస్ అమ్మకాలు
*నేడు ఒడిశాకు చేరుకోనున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర
*నేడు అండర్-19 వరల్డ్‌కప్ సెమీఫైనల్ మ్యాచ్.. సెమీఫైనల్‌లో భారత్‌తో తలపడనున్న సౌతాఫ్రికా.. విల్లోమోర్ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్