Asaduddin Owaisi: ఇల్లాలిలో ఎలా నడుచుకోవాలనే విషయాన్ని వివరంగా చెప్పారు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. భార్యపై కోపం వెళ్లగక్కడం పౌరుషం అనిపించుకోదని, ఆమె కోపాన్ని తట్టుకోవడమే నిజమైన పౌరుషం అని అన్నారు. పార్టీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. భార్యలతో మగవారు మంచిగా నడుచుకోవాలని అన్నారు. ‘‘నేను ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాను. ఇది చాలా మందిని కలవరపెట్టింది. మీ భార్య మీ బట్టలు ఉతకాలి, మీకు వంట చేయాలి, మీ తలకు మసాజ్ చేయాలి అని ఖురాన్ చెప్పలేదు. వాస్తవానికి భార్య సంపాదనపై భర్తకు హక్కు లేదు. కానీ, భర్త సంపాదనపై భార్యకు హక్కు ఉంటుంది, ఎందుకంటే ఆమె ఇంటిని నడపాల్సి ఉంటుంది’’ అని ఆయన అన్నారు.
Read Also: Arvind Kejriwal: “నన్ను బీజేపీలో చేరమని బలవంతం చేస్తున్నారు”.. కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు..
చాలా మంది తమ భార్యలు వంట చేయడం లేదని, వారి వంటలో తప్పులు కనుగొని విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. ఇది ఇస్లాంలో ఎక్కడా రాయబడలేదని చెప్పారు. భార్యల పట్ల క్రూరంగా ప్రవర్తించే వారు ఉన్నారు, వారిని కొట్టే వారు ఉన్నారు, మీరు నిజమైన ప్రవక్త అనుచరులైతే, ఆయన మహిళలపై ఎక్కడ చేయి ఎత్తాడో చెప్పాలని సవాల్ విసిరారు. అనవసరంగా మీ భార్యపై కోపం వెళ్లగక్కడం పౌరుషం కాదని అన్నారు. ఇక్కడ కొంతమంది తమ భార్యలు ఎదురుతిరిగి సమాధానం చెబితే మనస్తాపం చెందుతారు, చాలా మంది రాత్రి వరకు స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, వారి భార్యలు, పిల్లలు, తల్లులు వారి కోసం ఇంట్లో ఎదురుచూస్తుంటారని, ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని అసదుద్దీన్ ఓవైసీ కోరారు.
Islam mein khawateen ka maqaam#AIMIM #AsaduddinOwaisi #Islam #HonourWoman #WomenPower #Majlis #Hyderabad #Telangana #India pic.twitter.com/zkDu9FDHEO
— AIMIM (@aimim_national) February 4, 2024