Manipur : ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లోని టెంగ్నౌపాల్ జిల్లాలోని సరిహద్దు పట్టణం మోరేలో భద్రతా బలగాలు, కుకీ ఉగ్రవాదుల మధ్య బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. కొన్ని నెలల తరబడి ఈ రాష్ట్రంలో హింసాకాండ కొనసాగుతూనే ఉంది.
Narendra Modi : జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్రమోడీ హాజరు కానున్నారు.
India-Maldives Relations: భారత్‌తో కొనసాగుతున్న వివాదం మధ్య మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశ రాజధాని మాలేలో జరిగిన మేయర్ ఎన్నికల్లో ఆయన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పిఎన్‌సి) పార్టీ ఓడిపోయింది.
Stray Dogs Attack: విధికుక్కులు చిన్నారుల ప్రాణాలను తీస్తున్నాయి. ఇటీవల పలు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ నగరంలో ఏడు నెలల బాలుడిపై వీధికుక్కలు దాడి చేసి ప్రాణం తీశాయి. ఈ ఘటన బుధవారం నగరంలోని అయోధ్య నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనను పోలీసులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు అధికారులు వెల్లడించారు.
Suchana Seth : కుమారుడి హంతకురాలు సీఈవో తల్లి సుచనా సేథ్ ఉదంతం ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే. ఆమె హత్య చేయడానికి ముందు చిన్నారికి అధిక మోతాదులో దగ్గు సిరప్ ఇచ్చింది.
Bihar: బీహార్ ప్రొఫెసర్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. జేపీ యూనివర్సిటీల పరిధిలోని కాలేజీలో పొలిటికల్ సైన్స్ విభాగం హెడ్‌గా ఉన్న ఖుర్షీద్ ఆలం అనే ప్రొఫెసర్ ‘భారత ముస్లింలకు ప్రత్యే మాతృభూమి కావాలి’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై ఆ రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మాజీ మోడల్ దివ్య పహుజా హత్యకు గురైన గురుగ్రామ్ హోటల్ నుంచి ఆమె మృతదేహాన్ని తరలించేందుకు ఉపయోగించిన బీఎండబ్ల్యూ కారు పంజాబ్లోని పాటియాలాలో దొరికింది. కారు లాక్ చేయబడి ఉంది. కారులో దివ్య మృతదేహం ఉందో లేదో పోలీసులు ఇంకా ధృవీకరించలేదు.