Driver Saved Lives: గుండెపోటు వచ్చినా కేర్ చేయలే.. 60 మందికి పైగా ప్రాణాలు కాపాడిన డ్రైవర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Driver Saved Lives: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మంగళవారం నాడు 60 మందికి పైగా ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు ఓ బస్సు డ్రైవర్. ఆ వ్యక్తి బస్సును నడుపుతున్నప్పుడు అతనికి గుండెపోటు రాగా.. ఆ నొప్పితో కూడా బస్సును ఆపి బస్సులోని ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు. కానీ బస్సును ఆపిన అనంతరమే అతని గుండె ఆగిపోయింది. ఆ బస్సులోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ డ్రైవర్ బస్సును ఆపి ప్రాణాలు విడిచినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున ఒడిశాలోని బాలాసోర్ జిల్లా పటాపూర్ చక్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Read Also: Metro Train: మెట్రో ట్రైన్ లో పొట్టు పొట్టు కొట్టుకున్న ప్రయాణికులు
Also Read
- AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
- Ganesh Immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. MJ మార్కెట్ నుంచి ఖైరతాబాద్ వరకు పటిష్ట బందోబస్తు.!
- Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ
పశ్చిమ బెంగాల్ నుంటి పర్యాటకులతో బస్సు జిల్లాలోని పంచలింగేశ్వరాలయం వైపు వెళుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు వచ్చిందని పోలీసులు తెలిపారు. నొప్పిగా అనిపించిన వెంటనే డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపి స్పృహ కోల్పోయాడు. భయాందోళనకు గురైన ప్రయాణికులు స్థానికులను పిలిచారు, వారు డ్రైవర్‌ను షేక్ అక్తర్‌గా గుర్తించి సమీపంలోని నీలగిరి సబ్‌డివిజనల్ ఆసుపత్రికి తరలించారు. అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు.
డ్రైవర్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురై బస్సును నిలిపివేసినట్లు ప్రయాణీకుల్లో ఒకరైన అమిత్ దాస్ తెలిపారు. రోడ్డుకు ఒకవైపు వాహనం ఆగిన వెంటనే స్పృహతప్పి పడిపోయాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. డ్రైవర్ మనోగతాన్ని ప్రయాణికులు, స్థానికులు కొనియాడారు. ప్రయాణికుల ప్రాణాలను రక్షించిన ఆయనను దేవుడిలా కొనియాడుతున్నారు.
తాజావార్తలు
-
EC: ఎన్నికల సంఘాన్ని ఏలుతున్నదెవరు?
-
Protein Beer: మందుబాబులు, మందుపాపలు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్..!ప్రోటీన్ బీర్ మంచిదేనా?
-
Renault Rafale Hypnotic: రెనాల్ట్ రఫేల్ హిప్నోటిక్ లాంచ్.. 300hp పవర్, 1,000KM రేంజ్‌తో అదిరిపోయే SUV
-
Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
-
AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
ట్రెండింగ్
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?