ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లైవ్ విద్యుత్ తీగలను తాకడంతో ఓ ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో దాదాపు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు.
బెంగళూరు సెంట్రల్ జైలు నుంచి లష్కరే తోయిబా తీవ్రవాదులు పరారీ కేసులో దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 17 చోట్ల ఎన్‌ఐఏ సోదాలు చేస్తోంది. ఢిల్లీ, ముంబయి, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణతో పాటు మరో రెండు రాష్ట్రాల్లోని 17 చోట్ల ఎన్‌ఐఏ బృందాలు సోదాలు చేస్తున్నాయి.
Supreme Court : ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభల్లో ఓటు వేయడానికి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన సందర్భంలో వారికి విచారణ నుంచి మినహాయింపు ఉండదని అత్యున్నత న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది.
హైదరాబాద్‌ను మరో 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచండి: హైదరాబాద్‌ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. హైదరాబాద్‌ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా పేర్కొంటూ చట్టం తెచ్చేలా కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఏపీ విభజన చట్టం 2014 ప్రకారం.. తెలంగాణ, ఏపీల మధ్య ఆస్తులు, అప్పులు, తొమ్మిదో షెడ్యూల్‌లో పేర్కొన్న వివిధ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన ప్రక్రియ పూర్తికాలేదని పేర్కొంటూ…
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సవాల్-ప్రతి సవాల్: ఎన్నికల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సవాల్-ప్రతి సవాల్‌తో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి అవినీతిపరుడు అంటూ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కరపత్రాలు పంచారు. నువ్వు నిరూపించూ అంటూ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి సవాల్ విసిరారు. దాంతో ఇరువురు నేతలు బహిరంగ చర్చకు సిద్ధం అయ్యారు. దాంతో అనపర్తిలో ఏమి జరుగుతుందంటూ ప్రజల్లో ఉత్కంఠ…
ప్రజా సమస్యలపై బీజేపీ మాత్రమే పోరాటం చేస్తుంది: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాత్రమే పోరాటం చేస్తుందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఎన్నికలు ఇంకా ఎంతో దూరంలో లేవని, ఎన్నికలు అనంతరం బీజేపీ బలీయమైన శక్తిగా అవతరిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ మాత్రమే పని చేస్తోందని, ప్రతి సమస్యపై బీజేపీ గళం విప్పిందని పురందేశ్వరి పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందంటే దానికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటే…
నేటితో ముగియనున్న కాంగ్రెస్ ధరఖాస్తుల పరశీలన: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు అభ్యర్థుల వేటలో నిమగ్నమయ్యాయి. వైసీపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల జాబితాపై కసరత్తులు చేస్తున్నాయి. ఈ క్రమంలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీ.. విజయవాడ ఆంధ్ర భవన్‌లో దరఖాస్తులను స్వీకరిచింది. నేటితో కాంగ్రెస్ ధరఖాస్తుల పరశీలన ముగియనుంది. బుధవారం అర్ధరాత్రి వరకూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే అభ్యర్ధులు…
Supreme Court : యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేదానికి సంబంధించిన సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కంపెనీ తప్పుదారి పట్టించే ప్రకటనకు సంబంధించిన కేసు ఈరోజు సుప్రీంకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది.