*అమరావతి: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. తొలిరోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం.. ఈ నెల 7న ఓటాన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి.. 10 ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమైన టీడీపీ.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రోజూ నిరసన తెలుపుతూ అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయం.
*అమరావతి: నేడు, రేపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు రా కదలి రా బహిరంగ సభలు.. రెండు రోజుల్లో మూడు చోట్ల రా కదలి రా సభలు చేపట్టనున్న చంద్రబాబు.. నేడు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో మాడుగుల, ఏలూరు పార్లమెంట్ పరిధిలో చింతలపూడిలలో రా కదలి రా సభలు.. రేపు చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని గంగాధర నెల్లూరులో రా కదలి రా సభలో పాల్గొననున్న చంద్రబాబు..ఇప్పటి వరకు 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో రా కదలి రా సభల నిర్వహణ.
*తిరుమల: ఇవాళ శ్రీవేంకటేశ్వర ధార్మిక సదస్సు తీర్మానాలను వెల్లడించనున్న టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి
*హైదరాబాద్: నేడు బీఆర్కే భవన్‌లో పీఆర్సీ కమిషన్‌తో పోలీస్ శాఖ ఉన్నతాధికారుల సమావేశం.. పోలీస్ శాఖ పీఆర్సీ కోసం సెక్రటేరియట్ డిపార్ట్‌మెంట్, హెచ్‌ఓడీలతో సంప్రదింపుల సమావేశం.. పే రివిజన్ కమిటీ సమావేశానికి సంబంధిత పీఆర్‌సీ డీలింగ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్లను సంబంధిత డాక్యుమెంట్లు, వివిధ కేటగిరీల పోస్టుల సర్వీస్ రూల్స్‌తో హాజరు కావాలని ఆదేశాలు.. పీఆర్సీ కమిషన్‌తో ఉదయం 11:30 గంటలకు డీజీపీ, సాయంత్రం 3 గంటలకు జైళ్ల శాఖ డీజీ సమావేశం.
*ఖమ్మం: నేడు ఇల్లందు మున్సిపల్ ఛైర్మన్ వెంకటేశ్వర రావుపై అవిశ్వాసం.. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన వెంకటేశ్వరరావు.
*నేడు జార్ఖండ్‌లో బలపరీక్ష.. బలపరీక్ష ఎదుర్కోనున్న చంపై సోరెన్.
*తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,380.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,100.. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. 77,000
*IND vs ENG 2nd Test: నాలుగో రోజు కొనసాగనున్న ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్.. రసవత్తరంగా కొనసాగుతున్న మ్యాచ్.. ఇంగ్లాండ్ గెలవడానికి కావాల్సిన పరుగులు 332, చేతిలో 9 వికెట్లు.