భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. దేశానికి, సమాజానికి నిస్వార్థంగా సేవలు అందిస్తున్నందుకు ప్రధాని మోదీకి మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ అవార్డును నిర్వాహకులు ప్రదానం చేశారు. ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ పురస్కారాన్ని ముంబైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మోదీకి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉషా మంగేష్కర్, ఆశాభోంస్లే, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి, మహారాష్ట్ర బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర…
పార్లమెంట్లో పెద్దల సభగా పేరు పొందిన రాజ్యసభపై అధికార పార్టీ బీజేపీ పట్టు బిగిస్తోంది. చరిత్రలో తొలిసారిగా రాజ్యసభలో తన బలాన్ని బీజేపీ 100 సీట్లకు పెంచుకుంది. రాజ్యసభలో ఈ స్థాయిలో సీట్లు పొందడం బీజేపీకి ఇదే తొలిసారి. గతంలో ఒక్కసారి మాత్రమే రాజ్యసభలో ఓ పార్టీ 100 కంటే ఎక్కువ సీట్లను హస్తగతం చేసుకుంది. 1990లో కాంగ్రెస్ పార్టీ ఈ ఫీట్ సాధించింది. అప్పుడు పెద్దల సభకు ఆ పార్టీ తరఫున 108 మంది సభ్యులు…
ఇండియాలో ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 3 నుంచి 5 వరకు బెన్నెట్ భారత్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఈ పర్యటన వాయిదా పడిందని ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం బెన్నెట్ ఐసోలేషన్‌లో ఉన్నారని.. ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారని వారు తెలిపారు. తమ ప్రధాని భారత్‌లో పర్యటించే కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని వారు పేర్కొన్నారు కాగా ప్రధాని మోదీ…
ప్రముఖ సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై వేసిన సెటైర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీజేపీకి వ్యతిరేకంగా ఉండే ప్రకాష్ రాజ్ తాజాగా మరో సెటైర్ పేల్చారు. మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. చంద్రకాంత్ పాటిల్ ప్రధాని మోదీ రెండు గంటలే నిద్రపోతారని, ఒక రోజులో 22 గంటల పాటు ఆయన పని చేస్తుంటారనీ చెప్పడంపై…
దేశానికి ప్రధానమంత్రి అయినా ఆయన అమ్మకు కొడుకే. పిల్లలు ఎంత పెద్దవారైనా తల్లి ముందు చిన్నవారే. వారి చిన్నతనం ఆమెకు గుర్తుకువస్తూ వుంటుంది. అందుకే ఎప్పుడూ అంటుంటారు దేశానికి రాజైనా… తల్లికి కొడుకే. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం తర్వాత ప్రధాని మోడీ రెండు రోజులపాటు సొంత రాష్ట్రం గుజరాత్ కి వెళ్ళిన సంగతి తెలిసిందే. గుజరాత్ పర్యటనలో ఆయన తన తల్లిని హీరాబెన్ ని కలిశారు. ఆమెతో కలిసి భోజనం చేశారు. మాతృమూర్తి క్షేమసమాచారాన్ని…
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు, విద్యార్థుల తరలింపును వేగవంతం చేసింది భారత ప్రభుత్వం.. ఇప్పటికే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలను కూడా రంగంలోకి దింపింది.. ఇక, మరోసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోడీ.. భారత విద్యార్థులను రష్యా మీదుగా తరలించాలని, విద్యార్థుల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని.. భారతీయులు సురక్షితంగా బయటకొచ్చేందుకు అవకాశం కల్పించాలని కోరారు.. దీంతో, ఖార్కివ్ నుంచి భారతీయులు వెళ్లేందుకు 6 గంటల పాటు…
పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు, ఉత్తరప్రదేశ్‌లో మూడో దశ పోలింగ్ ఆదివారం ప్రారంభమైన సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రాష్ట్రాల ప్రజలను ముఖ్యంగా యువతతో పాటు మొదటిసారి ఓటు వేయబోతున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. ‘పంజాబ్ ఎన్నికలు, యూపీ మూడో దశ ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. ఈరోజు ఓటు వేసే వారందరికీ, ప్రత్యేకించి యువతతో పాటు తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారికి పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని నేను పిలుపునిస్తున్నాను’ అని ప్రధాని మోదీ ట్వీట్లో…
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు ఏఐసీసీ అధికార ప్రతినిధి మోహన్ ప్రకాష్. మోదీ ప్రభుత్వం మనందరికీ అందించిన నూతన సంవత్సర బహుమతి కొత్త ద్రవ్యోల్బణం. గత ఏడేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా మోదీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఇచ్చిన కానుక ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం అన్నారు. ప్రభుత్వ అసమర్థ విధానాలపై ఆయన విరుచుకుపడ్డారు. బట్టలు, పాదరక్షలు కొనుక్కోవడం దగ్గర్నుంచి ఏటీఎంల నుంచి సొంత డబ్బు విత్‌డ్రా చేసుకోవడం వరకు ఖరీదు అయ్యాయన్నారు. పెరిగిన GST…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తర ప్రదేశ్‌పై ప్రధాని మోదీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక మహిళా సంఘాల ఖాతాలకు రూ.వెయ్యి కోట్లను ప్రధాని మోదీ బదిలీ చేశారు. ప్రయాగ్ రాజ్ పవిత్ర గంగా, యుమన, సరస్వతి నదుల సంగమ స్థలి అని మోదీ ప్రస్తుతించారు. వేలాది సంవత్సరాల మన మాతృ శక్తికి ప్రతీకగా దానిని…
మొదటి నుంచి భారత్-రష్యా మైత్రి ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాలు కూడా అంతే ప్రత్యేకమైనవి. రష్యా అధ్యక్షడు వ్లాదిమిర్ పుతిన్ నేడు భారత్‌కు రానున్నారు. రెండు దేశాల మధ్య జరిగే 21వ వార్షిక సదస్సులో ఆయన పాల్గొంటారు. అంతేకాకుండా భారత్ ప్రధాని నరేంద్రమోడీతో ప్రత్యేకంగా భేటీ అవ్వనున్నారు. వీరి సమావేశానికి ముందు ఇరు దేశాల రక్షణ, విదేశాంగశాఖ ప్రతినిధులు చర్చలు జరుపుతారు. ఈ నేపథ్యంలో పలు కీలక…