BJP National President: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శుక్రవారం పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం.. జనవరి 19న పార్టీ జాతీయ అధ్యక్షుడి పదవికి నామినేషన్లు దాఖలు చేస్తారు. మరుసటి (జనవరి 20న) రోజు కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబిన్ పోటీ లేకుండానే జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎందుకంటే ఈ…
మంత్రులు, కార్యదర్శుల మీటింగ్‌లో సీఎం చంద్రబాబు సీరియస్.. మంత్రులు, కార్యదర్శుల మీటింగ్‌లో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కార్యదర్శులు అందరూ వారి వారి శాఖల్లో కేంద్ర ప్రయోజిత పథకాల నిధులు ఎందుకు ఖర్చు చేయడం లేదని ప్రశ్నించారు. ఈనెల 15వ తేదీలోపు ఎందుకు ఖర్చు చేయడం లేదో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మీకు ప్రజల సొమ్ము మురిగిపోయేలా చేసే హక్కు ఎరవిచ్చారు అంటూ మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు ఫిభ్రవరి మొదటి, రెండవ వారాల్లో పెట్టి మార్చి 15వ…
భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచ యవనికపై సగర్వంగా నిలబెడుతున్న యుగపురుషుడు, ప్రధాని నరేంద్ర మోడీ. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడమే కాకుండా, ఆధునిక సాంకేతికతను జోడించి మన ప్రాచీన పుణ్యక్షేత్రాలకు నూతన శోభను చేకూరుస్తున్న అపర భగీరథుడు ఆయన. అచంచలమైన దైవభక్తితో, దేశభక్తిని మేళవించి ప్రతి భారతీయుడిలో స్వాభిమానాన్ని నింపుతున్న మోడీ పర్యటనతో సోమనాథ్ తీరం నేడు భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. భారతదేశ ఆధ్యాత్మిక , నాగరికతకు చిహ్నమైన గుజరాత్‌లోని సోమనాథ్ పుణ్యక్షేత్రం ఒక అపూర్వమైన ఘట్టానికి…
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరకపోవడానికి ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో నేరుగా మాట్లాడకపోవడమే అని ఆ దేశ వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లుట్నిక్ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై భారత్ స్పందిస్తూ.. ‘‘ఇవి సరైనవి కావు’’ అని చెప్పింది.
భారత్-పాక్ యుద్ధం ఆపితే గుర్తించలేదు.. నెతన్యాహుతో ట్రంప్ ఆవేదన భారత్-పాకిస్థాన్ యుద్ధం విషయాన్ని ట్రంప్ మరోసారి ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపితే సరైన క్రెడిట్ దక్కలేదని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో నెతన్యాహును కలిసిన సందర్భంగా మరోసారి ట్రంప్ గుర్తుచేశారు. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం భారత ప్రభుత్వం మే 7న పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. మే 10న ఇరు దేశాలు…
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడింది. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. బెంగాల్ రాష్ట్రంలో ఉగ్రవాద నెట్‌వర్క్‌లు పనిచేస్తున్నాయని అమిత్ షా చేసిన ఆరోపణలపై స్పందిస్తూ.. పహల్గాం దాడిని కేంద్రమే చేసిందా? అని మమత ప్రశ్నించారు.
Digvijaya Singh: బీజేపీ, ఆర్ఎస్ఎస్లను ఎప్పుడూ విమర్శించే కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, తాజాగా ఈ సంస్థలపై ప్రశంసలు కురిపించడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని రాహుల్ గాంధీకి లేఖ రాసిన వారం తర్వాత కొత్త వివాదానికి తెర లేపారు. 1990ల నాటి ప్రధాని మోడీ, అద్వానీల బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేస్తూ, బీజేపీ దాని సైద్ధాంతిక మాతృసంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)పై ప్రశంసించారు.
Arunachal Pradesh: భారత అంతర్భాగమైన ‘‘అరుణాచల్ ప్రదేశ్’’ తమదే అని, అది దక్షిణ టిబెట్‌లో భాగమని చైనా ఎప్పటి నుంచో వాదిస్తోంది. అయితే, ఎప్పటికప్పుడు అరుణాచల్ తమ దేశం నుంచి విడదీయలేని అంతర్భాగమని భారత్ కౌంటర్ ఇస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా అమెరికన్ కాంగ్రెస్‌కు సమర్పించిన పెంటగాన్ నివేదికలో, అరుణాచల్ ప్రదేశ్ చైనా ‘ప్రధాన ఆసక్తుల్లో’ ఒకటిని చెప్పింది. అరుణాచల్‌పై చైనా రాజీకి, చర్చలకు సిద్ధంగా లేదని నివేదిక పేర్కొంది. చైనాలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం తైవాన్, దక్షిణ…
Pawan Kalyan: 21 ఎమ్మెల్యే, 2 ఎంపీలు ఉన్న పార్టీకి ప్రధాని నరేంద్ర మోడీతో సహా జాతీయ స్థాయిలో మనకి గౌరవం ఇస్తున్నారంటే.. జనసేన అంత బలమైనది అని అర్థం అన్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. జనసేన పదవి – బాధ్యత పేరుతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రాంతీయ దృక్పథంతో నేను పార్టీ పెట్టలేదు.. జాతీయ దృక్పథంతో ప్రాంతీయ పార్టీ పెట్టాలి అనుకుని పెట్టాను అన్నారు.. జనసేన ఐడియాలజీ గడిచే…
బంగ్లా సైన్యాన్ని దెబ్బతీసేందుకు పాక్ ఐఎస్ఐ కుట్ర.. నిఘా నివేదికలో సంచలన విషయాలు.. బంగ్లాదేశ్ ఇప్పుడు ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. అక్కడి రాడికల్ ఇస్లామిక్ శక్తులు ఆ దేశాన్ని కబ్జా చేయాలని చూస్తున్నాయి. ఇదే కాకుండా, అంతర్గత వర్గ పోరును కూడా భారత్‌కు ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ, రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హాది హత్య. దీంట్లో భారత ప్రమేయం ఉందని చెబూతూ, అక్కడి మతోన్మాద మూక ఢాకాలోని భారత…