ఏపీలో రాజకీయాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోనసీమలో అల్లర్ల గురించి ఆయన స్పందిస్తూ.. అంబేద్కర్ పేరు కోనసీమ ప్రాంతానికి పెట్టడం చిన్న విషయం అని.. అంబేద్కర్ లాంటి మహనీయుడి పేరును రాష్ట్రాలకు పెట్టాలని సూచించారు. అంబేద్కర్ జీవితం ఇప్పటి నేతలకు ఆదర్శమన్నారు. వైసీపీ చేసిన బస్సు యాత్ర తుస్సుమందన్నారు. వైసీపీ మంత్రుల బస్సు యాత్రకు ప్రాధాన్యత లేదని.. కనీసం వారి మాటలు వినడానికి జనాలు లేరని చురకలు అంటించారు.
YSRCP: మీ ప్రేమ ఇలాగే కొనసాగాలి.. ఆసక్తి రేపుతున్న సీఎం జగన్ ట్వీట్
ఏపీలో దళితులపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. దళిత నాయకత్వం పూర్తిగా బలహీనపడటమే ఈ దాడులకు కారణమన్నారు. 80 లక్షల మంది బిడ్డలకు స్కాలర్ షిప్‌లు తీసేశారని.. ఇది సామాజిక అన్యాయమని విమర్శలు చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం అమృతారావు 53 రోజులు దీక్ష చేసి సాధిస్తే ఇప్పుడు కష్టాలలో ఉందన్నారు. తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయం కోసం తాను తీవ్రంగా కృషి చేసి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పునాది రాయి వేసి పూర్తి చేశామని.. మోదీ దీనిని ప్రారంభించారని చింతా మోహన్ తెలిపారు. అయితే ఇప్పుడు దానిని ప్రైవేట్ పరం చేయాలని కేబినెట్‌లో పెట్టారని.. దానిని ఆపడానికి తాను ఢిల్లీ వెళ్లి 20 రోజులు కూర్చుని పని పూర్తి చేసుకుని వచ్చానని చింతామోహన్ వెల్లడించారు. మోదీ సర్కారు చేపడుతున్న తిరుపతి ఎయిర్‌పోర్టు ప్రైవేటీకరణను ఆపి తీరుతానన్నారు.