మోడీ ప్రధానిగా అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తి చేయడం దేశం గర్వించదగ్గ విషయమని ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మినారాయణ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు దేశ రక్షణ కోసం మోడీ చేసిన కృషి అద్భుతమని ఆయన వ్యాఖ్యానించారు. మన వైపు చూడాలంటే నే పాకిస్తాన్ భయపడే స్థితికి మోడీ తీసుకు వచ్చారని ఆయన అన్నారు. వైద్య ఆరోగ్యంలో జనరిక్ మందుల ద్వారా తక్కువ ధరకు నాణ్య మైన…
కొద్దిరోజుల నుంచి తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్లు తెలంగాణకు క్యూ కట్టడంతో.. పాలిటిక్స్ జోరందుకుంది. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెంచింది. మరోవైపు.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలపై కసరత్తును ప్రారంభించింది. ఈ సమావేశాలను హైదరాబాద్లో నిర్వహించునున్నారు. ఇందులో భాగంగా బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.ఎల్. సంతోష్ నగరానికి బుధవారం వచ్చారు. కాగా, మూడు రోజల పాటు జరిగే ఈ…
మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుంచి పీఎం మోదీకి ప్రజామోదం పెరగింది. తాజాగా సోమవారం లోకల్ సర్కిల్స్ తాజా సర్వే వెల్లడింది. 64,000 మంది అభిప్రాయాలను తీసుకుంటే ఇందులో 67 శాతంమంది రెండో విడత అధికారం చేపట్టిన తర్వాత మోదీ ప్రభుత్వం అంచనాలను అందుకున్నట్లు వెల్లడించింది. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో చాలా మరణాలు సంభవించాయి ఆ సమయంలో మోదీ ప్రజామోదం కేవలం 51 శాతం మాత్రమే ఉండేది. 2020 కోవిడ్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇది 62…
ఏపీలో రాజకీయాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోనసీమలో అల్లర్ల గురించి ఆయన స్పందిస్తూ.. అంబేద్కర్ పేరు కోనసీమ ప్రాంతానికి పెట్టడం చిన్న విషయం అని.. అంబేద్కర్ లాంటి మహనీయుడి పేరును రాష్ట్రాలకు పెట్టాలని సూచించారు. అంబేద్కర్ జీవితం ఇప్పటి నేతలకు ఆదర్శమన్నారు. వైసీపీ చేసిన బస్సు యాత్ర తుస్సుమందన్నారు. వైసీపీ మంత్రుల బస్సు యాత్రకు ప్రాధాన్యత లేదని.. కనీసం వారి మాటలు వినడానికి జనాలు లేరని చురకలు…
క్రీడాప్రియులు ముఖ్యంగా క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఇవాళ అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ 2022 తుది సమరం జరగనుంది. రసవత్తరంగా మారిన ఐపీఎల్ పోరు ఫైనల్ లో తలపడనున్నాయి రాజస్థాన్-గుజరాత్. ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది గుజరాత్ టైటాన్స్. రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్కి ముందు నరేంద్ర మోడీ స్టేడియంలో సినీ ప్రముఖులతో పాటు ప్రముఖులు సందడి చేయబోతున్నారు. ప్రధాని మోడీ…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గట్టి కౌంటర్లిచ్చారు. అవగాహన లేకుండా, చరిత్ర తెలియకుండా, మోదీ చేసిన వ్యాఖ్యలు.. ఆయన పదవికి తగ్గట్టుగా లేవన్నారు. మోదీకి కుటుంబం లేదని, అందువల్లే ఆయనకు సెంటిమెంట్లు తెలియవని అన్నారు. సీఎం కేసిఆర్ది కుటుంబ పాలన కాదని చెప్పిన ఎర్రబెల్లి.. తెలంగాణ కోసం ఆయన కుటుంబం ఉద్యమించి, జైళ్ళకు పోయి, త్యాగాలు చేసిందన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన వారిని…
హైదరాబాద్ పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విస్తృత స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ వచ్చి వరాల జల్లు కురిపిస్తానని ప్రకటన చేసిన మోదీ.. ఇక్కడికొచ్చిన తర్వాత చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వీరయ్య విమర్శించారు. చిల్లర రాజకీయాలకు బేగంపేట విమానాశ్రయాన్ని వేదికగా చేసుకోవడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు. తెలంగాణ రాష్ట్రం, టిఆర్ఎస్ పార్టీ మీదున్న అక్కసును వెళ్ళగక్కడానికే హైదరాబాద్ పర్యటనని ఉపయోగించుకున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు, మేధావులు, పెద్దలు రాష్ట్రం కోసం…
హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కుటుంబ రాజకీయాల మీద చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. గురువింద గింజ తన కింద నలుపు చూసుకోవాలన్న ఆయన.. కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ కుమారుడు బీజేపీలో లేడా? మీది కుటుంబ పార్టీ కాదా? పంజాబ్లో అకాళీదళ్తో అధికారాన్ని పంచుకోలేదా? అది కుటుంబ పార్టీ కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కుటుంబ రాజకీయాల గురించి మోదీ మాట్లాడటం నిజంగా సిగ్గు చేటని, మీ ఎత్తులు ఎత్తి…
హైదరాబాద్ పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్రం, సీఎం కేసీఆర్ కుటుంబంపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల మీద మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ మరోసారి తెలంగాణపై విషం చిమ్మారని, ఆయన చేసిన వ్యాఖ్యలు దారుణమని అన్నారు. తల్లిని చంపి పిల్లని బతికించారన్న మోదీకి.. తెలంగాణ అమరవీరుల గురించి అర్హత లేదని, అసలు తెలంగాణలో బీజేపీకి స్థానమే లేదని అన్నారు. అభివృద్ధి పేరుతో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు దేశాన్ని…