ఏపీలో మండు వేసవిలో కరెంట్ కోతలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. అప్రకటిత కరెంట్ కోతలపై టీడీపీ నేతలు పలు చోట్ల ధర్నాలకు దిగారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని కురగల్లు గ్రామంలో బుధవారం రాత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటిస్తుండగా కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆయన నేరుగా లాంతర్ చేతబట్టి నిరసన తెలిపారు. మరోవైపు ఏపీలో పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా నర్సీపట్నంలో మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో లాంతర్లు, కాగడాలతో టీడీపీ…
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే జగన్ ఢిల్లీ టూర్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఓ పోల్ పెట్టారు. ఈ పోల్ ద్వారా జగన్ ఢిల్లీ దేనికోసం వెళ్లారని ఆయన ప్రశ్నలు వేశారు. ఇందులో భాగంగా నాలుగు అంశాలను ప్రస్తావించారు. ఈ మేరకు పేలని జ’గన్’ హస్తిన పయనమెందుకు అంటూ ఆయన పోల్‌ను పోస్ట్ చేశారు. ఈ పోల్‌లో తొలి…
2019 ఎన్నికలకు ముందు సీఎం జగన్ ఇచ్చిన హామీలు, ప్రస్తుతం చేస్తున్న పనులను ఉదహరిస్తూ టీడీపీ నేత నారా లోకేష్ సెటైరికల్ వీడియోను ట్వీట్ చేశారు. వైసీపీ ప్రొడక్షన్స్ సమర్పించు అత్యద్భుతమైన సినిమా ‘జనం చెవిలో జగన్ పూలు’ ఏప్రిల్ 1న విడుదల అని లోకేష్ ఈ వీడియోకు క్యాప్షన్ పెట్టారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు, మద్యనిషేధం, ప్రత్యేక హోదా, సన్నబియ్యం పంపిణీపై ఇచ్చిన హామీలను ఇప్పుడు తుంగలో తొక్కారని.. ప్రజలను జగన్ ఏప్రిల్ పూల్…
తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలి రా.. అంటూ నలభై ఏళ్ల క్రితం 1982 మార్చి 29వ తేదీన ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు ఓ ప్రభంజనం అయింది. ఓ విజయం మరో సంక్షోభం.. అంతకు మించి సవాళ్లు ఎన్నో ఎదుర్కొంటోంది టీడీపీ. కానీ ఎప్పటికప్పుడు కాల పరీక్షలో నిలబడుతూనే ఉంది. జాతీయ పార్టీలు తప్ప.. నలభై ఏళ్ల పాటు నిలబడిన ప్రాంతీయ పార్టీలు అరుదనే చెప్పాలి. ఒక ప్రాంతీయ పార్టీ చరిత్రలో నాలుగు దశాబ్దాలంటే తక్కువ సమయమేమీ కాదు.…
విశాఖపట్నంలో భూకబ్జాలపై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. విశాఖని రాబంధుల్లా పీక్కుతింటున్నారు వైసీపీ కబ్జాకోరులు అంటూ ఫైర్ అయ్యారు.. కన్నుపడిన ప్రతి గజాన్ని కబ్జా చేస్తూ విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేస్తున్నారని విమర్శించిన ఆయన.. ఏకంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఎస్పీకి చెందిన స్థలాన్నే వైసీపీ ఎంపీ ఆక్రమించడం వైసీపీ కబ్జాపర్వంలో సరికొత్త కోణం అన్నారు. స్థలం కబ్జా చేయడమే కాకుండా రివర్సులో ఎంపీ మనుషులు ఎస్పీకే వార్నింగ్ ఇవ్వడం విశాఖలో…
ఏపీ అసెంబ్లీలో వికేంద్రీకరణపై చర్చ సందర్భంగా మంత్రులు కోర్టులపై వ్యాఖ్యలు చేయడాన్ని మాజీ మంత్రి నారా లోకేష్ తప్పుబట్టారు. కేవలం మూడు రాజధానుల విషయంలో మాత్రమే శాసనసభలకు అధికారం లేదని కోర్టు చెప్పిందని లోకేష్ గుర్తుచేశారు. రాష్ట్ర విభజన అనేది పార్లమెంట్ చట్టం ద్వారా జరిగిందని.. పార్లమెంట్ చట్టాలకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదని లోకేష్ అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి మూడు రాజధానులు కావాలనుకుంటే.. 175 అసెంబ్లీ నియోజకవర్గాలను 175 జిల్లాలు చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఏపీ…
ఏపీ సీఎం జగన్‌పై మరోసారి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు చేశారు. టీడీపీని చూస్తేనే జగన్ భయపడుతున్నారని.. అందుకే టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి మద్యం పాలసీపై జగన్ ప్రకటన చేశారని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. సభలో టీడీపీ సభ్యులు ఉండే వాస్తవాలు బయటకు వస్తాయని సస్పెండ్ చేశారన్నారు. ప్రతిపక్ష నేతగా మద్య నిషేధంపై ఊరూరా తిరిగి హామీ ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చాక రూ.6వేల కోట్లు ఉన్న మద్యం ఆదాయాన్ని…
టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ పై డిప్యూటీ సీఎం నారాయణస్వామి అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అయితే తాను లోకేష్ ని ఉద్దేశించి ఎలాంటి అనుచిత కామెంట్లు చేయలేదని వివరణ ఇచ్చారు నారాయణస్వామి. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణతో జగన్ ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి నాతో మాట్లాడారు. ఆ వ్యక్తిని ఉద్దేశించి నేను చేసిన కామెంట్లని తనను ఉద్దేశించినట్టుగా లోకేష్ భావిస్తున్నారు. సభలో అలాంటి కామెంట్లు చేయకూడదు.. నేను…
ఏపీ కౌన్సిల్ జరుగుతున్న తీరుపై విపక్ష టీడీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. కల్తీసారా వాస్తవాలు బయటకొస్తాయని ప్రభుత్వం భయపడుతోంది.రాష్ట్రంలో లభ్యమయ్యే మద్యంతో రసాయనాలు ఉన్నాయనే ల్యాబ్ రిపోర్టులు మా దగ్గర ఉన్నాయి. కొన్ని రసాయనాలు సైనేడ్ గా మారొచ్చనే అధ్యయనాలు ఉన్నాయి. ఇవన్నీ బయటకొస్తాయనే మమ్మల్ని దూషించి చర్చ నుంచి పారిపోతున్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించమంటే స్పీకర్ మార్షల్స్ ని రమ్మంటున్నారు. మంత్రులు బొత్స, కొడాలినాని తరహాలో మా సభ్యులు ఎవ్వరూ ప్రవర్తించట్లేదు. కౌన్సిల్ ఛైర్మన్ గా…
పెగాసస్ విషయంలో టీడీపీపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పెగాసస్‌పై హౌస్ కమిటీ వేసినా.. జ్యుడిషయరీ కమిటీ వేసినా.. సీబీఐ విచారణ.. ఇలా దేనికైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే వైఎస్ వివేకా హత్య విషయంలో, ప.గో. జిల్లాలో కల్తీ మద్యం మరణాల విషయంలో వైసీపీ ప్రభుత్వం విచారణకు కమిటీ వేయగలదా అని ప్రశ్నించారు. పెగాసస్‌పై మమతా బెనర్జీ అసెంబ్లీలో మాట్లాడారా లేదా అనే…