ఏపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ మోసపు రెడ్డి బాదుడే బాదుడుకి కులం, మతం, ప్రాంతం లేదన్నారు. రెండు నెలలు కాకముందే డీజిల్ సెస్ పేరుతో మరోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచడం సామాన్యుడిపై పెను భారం మోపడమేనని లోకేష్ ఆరోపించారు. పల్లెవెలుగు సర్వీసుల్లో గరిష్టంగా రూ.25, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో రూ.90 పెంచారని.. అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ.120, ఏసీ సర్వీసుల్లో రూ.140 పెంచారని లోకేష్ అన్నారు. రెండో విడత బాదుడే బాదుడులో భాగంగా డీజిల్ సెస్ పేరుతో రూ.500 కోట్లను పేదల నుంచి వైసీపీ ప్రభుత్వం కొట్టేస్తుందన్నారు.
Read Also: APSRTC: తిరుమల-తిరుపతి మధ్య భారీగా పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు
ఆఖరుకు విద్యార్థుల బస్సు పాసులను కూడా వదలకుండా బాదేయడం దారుణమన్నారు. ఏపీలో పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఆర్టీసీ రూపురేఖలు మారుస్తానన్న జగన్ మోసపు రెడ్డి ఇప్పుడు సంస్థ ఉనికినే ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని.. ప్రజారవాణా వ్యవస్థ ఆర్టీసీని ప్రజలకి దూరం చేస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పల్లెవెలుగు సర్వీసుల్లో గరిష్టంగా రూ.25, ఎక్స్ ప్రెస్ లో రూ.90, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ రూ.120, ఏసీ సర్వీసుల్లో రూ.140 పెంచారు. రెండో విడత బాదుడే బాదుడులో భాగంగా డీజిల్ సెస్ పేరుతో రూ.500 కోట్లు పేదల నుండి కొట్టేస్తుంది వైసిపి ప్రభుత్వం.(2/3)
— Lokesh Nara (@naralokesh) July 1, 2022