Uma Maheswari Death: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి తరలివెళ్తున్నారు. మంగళవారం తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీఆర్ఎస్ నేత వేణుగోపాలాచారితో పాటు పలువురు నందమూరి కుటుంబ సభ్యులు ఉమా మహేశ్వరి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమా మహేశ్వరి…
Kesineni Nani : బెజవాడ ఎంపీ కేశినేని నాని.. టీడీపీలో ఎవరికి గురి పెట్టారు? సూతిమెత్తంగా ఎవరికి చురకలు వేశారు? ఇటీవల జరుగుతున్న పరిణామాలకు వాళ్లే కారణమనే ఫీలింగ్‌లో ఉన్నారా? ప్రైవేట్ సంభాషణల్లో నాని చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే.. ఆయన ఏదైనా నిర్ణయం తీసుకున్నారా? టీడీపీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? కేశినేని నాని. బెజవాడ టీడీపీలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ఉన్న ఎంపీ. గత ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారానికి దూరమైన తర్వాత.. ఆయన కూడా…
Nara Lokesh Comments On Mahanadu : టీడీపీలో ఇటీవల ఓ ట్రెండ్ మొదలైంది. సంచలన విషయాలను త్వరలోనే బయటపెడతామని చెబుతారు నాయకులు. ఆ తర్వాత అంతా గప్‌చుప్. ఉలుకు ఉండదు.. పలుకు ఉండదు. ఆ స్టేట్మెంట్స్ ఎందుకిస్తారో.. ఏంటో వాళ్లకే తెలియాలన్నది తమ్ముళ్ల మాట. ఇంతకీ ఇది వ్యూహమా? లేక ఇంకేదైనా ఉందా? ఎవరా నాయకులు? లెట్స్ వాచ్..! ఏదైనా ఓ అంశానికి సంబంధించి ప్రభుత్వాన్నో.. ప్రభుత్వంలోని పెద్దలనో టార్గెట్ చేసే క్రమంలో విపక్షాలు…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహంతోనే హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పల్నాడు జిల్లా, రొంపిచర్ల మండల తెలుగుదేశం అధ్యక్షుడు వెన్నా బాల కోటిరెడ్డిపై అలవల గ్రామంలో జరిగిన దాడి ఘటనను సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ఖండించిన ఆయన.. ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లిన వ్యక్తిపై గొడ్డళ్ళతో దాడి చేశారంటే ఏపీలో శాంతి భద్రతల రక్షణ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? నిద్రపోతున్నాయా? అని ప్రశ్నించారు.. తెలుగుదేశం కార్యకర్తలు, నేతల హత్యలకు జగన్ ప్రోత్సాహం ఉంది కాబట్టే.. వైసీపీ నేతలు…
సోషల్ మీడియా వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఈ సందర్భంగా తమకు ఓటు వేయని ఓ ఇంటిని వైసీపీ నేత కబ్జా చేసిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన ప్రస్తావించారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం గానుగ పెంటలో మేకల కాపరి మర్రి శ్రీను ఇంటిని వైసీపీ నేతలు కబ్జా చేశారని లోకేష్ ఆరోపించారు. తమకు ఓటేయకపోతే వేటు వేయడం వైసీపీ నయా ఫ్యాక్షన్ డెమోక్రసీ…
పేదపిల్లలకు ప్రభుత్వ విద్యను దూరం చేయవద్దని కోరుతూ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. జాతీయ విద్యావిధానం, పాఠశాలల విలీనంతో పేదపిల్లలకు ప్రభుత్వ విద్య దూరం చేయవద్దని ఆయన లేఖలో కోరారు. పాఠశాలల ప్రారంభం రోజునే లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ నిర్ణయం శరాఘాతంగా మారిందని లోకేష్ ఆరోపించారు. ఆగమేఘాలపై జాతీయ విద్యా విధానం అమలు, పాఠశాలల విలీనంపై తీసుకున్న నిర్ణయం పేద విద్యార్థులను ప్రభుత్వ విద్యకు…