మరోసారి వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. జగన్ రెడ్డి అండతో వైసీపీ నేతలు సాగిస్తున్న అరాచకాలకు మరొక గిరిజన మహిళా ఉద్యోగి బలి కావడం రాష్ట్రంలో భయానక పాలనకి అద్దం పడుతోందని లోకేష్ అన్నారు. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి రొడ్డా భవానీ వైసీపీ నేతల వేధింపులు తాళలేక ఆత్మహత్యకి పాల్పడిందని ఆరోపించారు లోకేష్. ఎస్టీ మహిళా ఉద్యోగిని వేధించి బలవన్మరణానికి కారకులైన వైసీపీ నేతల్ని తక్షణమే అరెస్టు చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.
Chintamaneni Prabhakar : కోడిపందాలు అంటే నాకు చిన్నప్పటినుంచి వ్యసనం..
డాక్టర్ సుధాకర్ నుంచి భవానీ వరకూ ప్రభుత్వ ఉద్యోగుల మరణాలన్నీ వైసీపీ చేసిన హత్యలేనని అన్నారు. ఈ హత్యలని తప్పుదారి పట్టిస్తూ, నిందితులైన వైసీపీ నేతలని కాపాడుతున్న పోలీసులు, అధికారులకు కూడా జగన్ రెడ్డి క్రూర పాలనలో ఇదే గతి పట్టొచ్చని లోకేష్ మండిపడ్డారు. వైసీపీ బాధితులైన సాటి ఉద్యోగులకి అండగా నిలవాలని ఉద్యోగులను లోకేష్ కోరారు.