Nara Lokesh : అల్లూరి విగ్రహావిష్కరణపై ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh interesting Comments on Alluri Sitaram Raju Statue.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి నేడు. అయితే ఈ నేపథ్యంలోనే ఏపీలోని భీమవరంలో 30 అడుగుల సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని నేడు ప్రధాని మోడీ ఆవిష్కరించనున్న క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా.. ‘అమాయక గిరిజనం నిరంకుశ పాలకుల చేతుల్లో నలిగిపోతుంటే వారిలో ధైర్యం నింపి నిప్పు కణాల్లా మార్చిన ఉత్తేజం అల్లూరి సీతారామరాజు. స్వాతంత్య్ర పోరులో ధృవతారలా మెరిసి బ్రిటిష్‌వారి గుండెల్లో దడపుట్టించిన మన్యంవీరుడు అల్లూరిని ఆజాది కా అమృత మహోత్సవ్ లో భాగంగా స్మరించుకోవడం మనకు గర్వకారణం. అల్లూరి 125వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని చేతుల మీదుగా అల్లూరి విగ్రహావిష్కరణ జరగడం ఒక తెలుగువాడిగా సంతోషంగా ఉంది. అల్లూరి జయంతి సందర్భంగా ఆ విప్లవజ్యోతి సాహస చరిత్రను స్మరించుకుని స్ఫూర్తిని పొందుదాం.’ అని నారా లోకేష్ పోస్ట్ చేశారు. అయితే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్‌తో పాటు గవర్నర్ బిష్వభూషన్ హరిచందన్ పాల్గొననున్నారు. అయితే భీమవరంలో ప్రధాని మోడీ నేపథ్యంలో ఇప్పటికే భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు.
Also Read
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
- AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
- OTR: పెనుకొండ వైసీపీలో పీక్స్‌కు చేరిన వర్గపోరు
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!