ఏపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ మోసపు రెడ్డి బాదుడే బాదుడుకి కులం, మతం, ప్రాంతం లేదన్నారు. రెండు నెలలు కాకముందే డీజిల్ సెస్ పేరుతో మరోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచడం సామాన్యుడిపై పెను భారం మోపడమేనని లోకేష్ ఆరోపించారు. పల్లెవెలుగు సర్వీసుల్లో గరిష్టంగా రూ.25, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో రూ.90 పెంచారని.. అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ.120, ఏసీ సర్వీసుల్లో…
సీఎం వైఎస్ జగన్కు మీడియాని చూస్తే భయం, సోషల్ మీడియా అంటే వణుకు అంటూ సెటైర్లు వేశారు నారా లోకేష్.. చివరికి యూట్యూబ్ ఛానెల్ థంబ్ నైల్ చూసి జడుసుకునే జగన్ సింగిల్ గా వచ్చే సింహమా! వీధి కుక్క కూడా కాదు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అమరావతిపై హైకోర్టు తీర్పు తర్వాత అక్కడ అభివృద్ధి పనుల కోసమంటూ భూములను ఎకరా రూ.10 కోట్ల చొప్పున అమ్మేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి విమర్శలు చేశారు. రాజధాని అమరావతిని ఆనాడు స్మశానం అని ప్రచారం చేసి ఈరోజు ఎకరం భూమి రూ.10 కోట్లకు ఎలా అమ్మకానికి పెట్టారని వైసీపీ నేతలను లోకేష్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి…
అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించి పేదల ఆకలి తీర్చాలంటూ ఏపీ సీఎం జగన్కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. ఏపీ వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు అర్జెంటుగా తెరవాల్సిన అవసరం ఉందని లేఖలో లోకేష్ పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నగారి పేరు మీద ద్వేషమో .. ఆకలి జీవులంటే అసహ్యమో తెలియదు కానీ అన్నా క్యాంటీన్లను మూసేశారని ఆరోపించారు.అన్న క్యాంటీన్లకు తాళాలు వేయడంతో పేదలు, కూలీలు, అభాగ్యుల ఆకలి తీర్చే…
పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో గురువారం సాయంత్రం టీడీపీ నేత నారా లోకేష్ పర్యటించారు. బొల్లాపల్లి మండలం రావులాపురంలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త జల్లయ్య కుటుంబాన్ని లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కారు ముందు భాగంలో కూర్చుని అభిమానులకు లోకేష్ అభివాదాలు చేశారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. తమ కార్యకర్తలను హత్య చేస్తే భయపడతామని జగన్ మాఫియా రెడ్డి భ్రమపడుతున్నారని ఆరోపించారు.…
టీడీపీ నేత నారా లోకేష్పై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. ఎక్కడ బిడ్డ పుట్టినా నేనే నాన్న అంటూ పరుగెత్తుకుని వెళ్లేరకం లోకేష్ అని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో నాలుగు సార్లు పరిశ్రమల సమ్మిట్ పెట్టారని.. ఖర్చుల పేరుతో రూ.150 కోట్లు చూపించారని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఫోటోల్లో పారలు పట్టుకున్నది ఎక్కడ.. పరిశ్రమ వచ్చింది ఎక్కడో లోకేష్ చెప్పగలడా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో సూటు,…
ఏపీ సీఎం జగన్కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించాలంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేయగలరా అంటూ సీఎం జగన్ను లోకేష్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు. ‘ఎన్డీయే అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే వైసీపీ మద్దతు తప్పనిసరి అని ఏ2 సెలవిచ్చారు. స్పెషల్ స్టేటస్ సాధిస్తారని ప్రజలు 22 మంది ఎంపీలను ఇచ్చారు. ప్రత్యేక…
సంక్షోభం నుంచి ఆక్వా రంగాన్ని గట్టెక్కించాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లేఖ రాశారు. ఇసుక పాలసీ మార్చి భవన నిర్మాణ రంగాన్ని దానికి అనుబంధంగా ఉన్న 130కి పైగా వ్యవస్థల్ని అస్తవ్యస్తం చేశారని ఆయన మండిపడ్డారు. వందలాది మంది భవననిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకు కారకులయ్యారని ఆరోపించారు. అనాలోచిత విధానాలతో విద్యుత్ కోతలు ఆరంభించి పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల…