Nara Lokesh: ఇంకెన్నాళ్లు మీ అరాచకాలు జగన్ రెడ్డి గారూ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఈ సందర్భంగా తమకు ఓటు వేయని ఓ ఇంటిని వైసీపీ నేత కబ్జా చేసిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన ప్రస్తావించారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం గానుగ పెంటలో మేకల కాపరి మర్రి శ్రీను ఇంటిని వైసీపీ నేతలు కబ్జా చేశారని లోకేష్ ఆరోపించారు. తమకు ఓటేయకపోతే వేటు వేయడం వైసీపీ నయా ఫ్యాక్షన్ డెమోక్రసీ అని నారా లోకేష్ చురకలు అంటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థుల ఏకగ్రీవానికి ఒప్పుకోకుంటే చేసిన అరాచకాలు చూశామని.. స్థానిక ఎన్నికల్లో వైసీపీ దాడులు, ఆస్తుల ధ్వంసం, బెదిరింపులు, కిడ్నాప్‌లు, హత్యలు చేయడం చూశామని.. ఎన్నికలై చాలా రోజులైనా టీడీపీకి ఓట్లేశారంటూ మద్దతు పలికారనే కక్షతో ఇప్పటికీ వైసీపీ నేతలు నానా ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నారని మండిపడ్డారు.
Read Also: Janasena Party: రోడ్ల దుస్థితిపై జనసేన డిజిటల్ క్యాంపెయిన్.. తేదీలు షురూ
Also Read
సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేసి తన ఓటమి కారణం అయ్యాడనే కక్షతో మర్రి శ్రీను ఇంటినే కబ్జా చేశారని లోకేష్ విమర్శలు చేశారు. అధికారం అండ చూసుకుని ఏకంగా ఇల్లు ఆక్రమించేయడంతో ఆ కుటుంబం రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెన్నాళ్లు మీ అరాచకాలు జగన్ రెడ్డి గారూ.. ప్రజలు తిరగబడకముందే ఇటువంటి కబ్జాలు, అరాచకాలు మానాలంటూ నారా లోకేష్ హితవు పలికారు.
ఓటు వేయకపోతే వేటు వేయడం వైసీపీ నయా ఫ్యాక్షన్ డెమోక్రసీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థుల ఏకగ్రీవానికి ఒప్పుకోకపోతే వైసీపీ దాడులు, ఆస్తుల ధ్వంసం, బెదిరింపులు, కిడ్నాప్‌లు, హత్యలు చేయడం చూశాం.(1/4) pic.twitter.com/KWGHq2xfs5
— Lokesh Nara (@naralokesh) July 12, 2022
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!