టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మనూర్ జయరాం.. కర్నూలు జిల్లా ఆలూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. కలియుగ రావణాసురులు చంద్రబాబు, లోకేష్ అంటూ మండిపడ్డారు.. రాష్ట్రంలో కొందరిని శూర్పణఖలను తయారు చేసిన ఘనత చంద్రబాబుదేనంటూ ఎద్దేవా చేశారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఫేక్ అని ఎస్పీ విచారణలో తేలిందని స్పష్టం చేసిన మంత్రి.. అయినా, ఆ వ్యవహారంలో ఇంకా వివాదం…
Nandyala TDP Politics :ఒకరు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే. ఇంకొకరు ఈసారి ఎమ్మెల్యే కావాల్సిందే అనుకుంటున్న ఓ మాజీ మంత్రి తనయుడు. ప్రత్యర్థులపై పోరుకంటే.. వాళ్లే పరస్పరం విమర్శించుకుంటున్నారట. మూడేళ్లుగా మిన్నకుండి.. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ సొంతగూటిలో సౌండ్ పెంచుతున్నారట. ఇంతకీ అది ఏ నియోజకవర్గం? లెట్స్ వాచ్..!
Nara Lokesh: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఒరిజినల్ కాదని అనంతపురం ఎస్పీ వెల్లడించడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో ఫేకో..? ఏది రియలో..? ప్రజలే తేలుస్తారని లోకేష్ వ్యాఖ్యానించారు. వైసీపీ ఎంపీ మాధవ్ వీడియో ఫేక్ అని అనంతపురం ఎస్పీ ఎలా తేల్చారని ప్రశ్నించారు. అంటే ఒరిజినల్ వీడియో ఉందని ఎస్పీ భావిస్తున్నారా అని నిలదీశారు. అనంతపురం ఎస్పీ ఏమైనా ఫోరెన్సిక్ ఎక్స్పర్టా అంటూ లోకేష్…
Gorantla Madhav: ఓ మహిళతో నగ్నంగా తాను మాట్లాడిన వీడియో ఫేక్ అని అనంతపురం ఎస్పీనే నిర్ధారించారని.. ఈ వీడియో మార్ఫింగ్ అని తాను ఆనాడే చెప్పానని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వెల్లడించారు. ఫేక్ వీడియోను క్రియేట్ చేసిన వారిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. కొంతమంది దుర్మార్గులు కలిసి చేసిన పని అని గోరంట్ల మాధవ్ ఆరోపించారు. రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టడానికి ఈ కుట్ర చేశారని ఆయన మండిపడ్డారు. బీసీలు ఎదుగుతుంటే చూసి…
గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది.. పార్టీకి రాజీనామా చేశారు గంజి చిరంజీవి.. పదవులు కోసం, పరపతి కోసం టీడీపీకి రాజీనామా చేయడం లేదు, సొంత పార్టీ నేతల వెన్నుపోట్లు భరించలేక రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు.
పార్టీలో యువతకు ప్రాతినిధ్యంపై టీడీపీ పొలిట్ బ్యూరో భేటీలో చర్చ లేవనెత్తారు లోకేష్.. దీంతో, ఆయన సూచనలపై సమగ్ర అధ్యయననానికి కమిటీ ఏర్పాటు చేయాలని తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ విభాగం కన్వీనర్గా కార్యకర్తల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన నారా లోకేష్.. ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించారు. చిన్న చిన్న సమస్యలకీ ఆస్పత్రుల చుట్టూ తిరిగి సమయం, డబ్బు ఖర్చు చేయలేని నిరుపేదలు, నియోజకవర్గంలో గ్రామీణుల కోసం మొదటిసారిగా `సంజీవని ఆరోగ్య రథం` పేరుతో మొబైల్ ఆస్పత్రి ఆలోచనకి కార్యరూపం ఇచ్చారు.