Ganji Chiranjeevi Resign: టీడీపీకి షాకిచ్చిన గంజి చిరంజీవి.. సంచలన వ్యాఖ్యలు.. లోకేష్ ఎఫెక్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది.. పార్టీకి రాజీనామా చేశారు గంజి చిరంజీవి… ఈ సందర్భంగా పార్టీ నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. టీడీపీలో మున్సిపల్ చైర్మన్ గా, 2014లో ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపిన ఆయన.. టీడీపీ అధికార ప్రతినిధి పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు.. ఇన్నాళ్లు నాకు అండగా ఉన్న నాయకులకు, కార్యకర్తలకు ఋణపడి ఉంటాను.. కానీ, టీడీపీలో బీసీగా ఉన్న నన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.. 2014లో నా ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమని సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. పదవులు కోసం, పరపతి కోసం టీడీపీకి రాజీనామా చేయడం లేదు, సొంత పార్టీ నేతల వెన్నుపోట్లు భరించలేక రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు.
Read Also: Manchu Mohan Babu: మరో వివాదంలో మంచు మోహన్‌బాబు.. ఈ సారి షిర్డీ సాయినాథునిపై..!
Also Read
- AP Municipal Elections 2026: సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏ కీలక భేటీ.. 40 శాతం వాటా కోరుతున్న జనసేన!
- AP Village Merger: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!
- Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
- Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
టీడీపీ వాళ్లే నా రాజకీయ జీవితాన్ని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు గంజి చిరంజీవి.. చివరి నిమిషం వరకు మంగళగిరి ఎమ్మెల్యే సీటు నాదే అని చెప్పి మోసం చేశారన్న ఆయన.. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అనే పదవి ఇచ్చి నన్ను మంగళగిరి ప్రజలకు దూరం చేశారన్నారు.. చేనేత, బీసీగా ఉన్న నన్ను అణగదొక్కారు.. నా ఆవేదన బాధ నాయకులకు తెలిసినా నన్ను పట్టించుకోలేదన్నారు. ఇక, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేసే వారితోనే నడుస్తాను.. అందరిని సంప్రదించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు గంజి చిరంజీవి. కాగా, 2014లో టీడీపీ నుంచి మంగళగిరి స్థానానికి బరిలోకి దిగిన గంజి చిరంజీవికి.. 2019 ఎన్నికల్లో మాత్రం సీటు దక్కలేదు.. ఆ స్థానం నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీకి దిగిన విషయం తెలిసిందే.. మరోసారి అక్కడి నుంచే పోటీ చేసేందుకు సిద్ధమైన లోకేష్.. పర్యటనలు, కార్యక్రమాలను కూడా పెంచారు.. ఈ నేపథ్యంలో.. మరోసారి తనకు అవకాశం రాదని భావించిన గంజి చిరంజీవి.. టీడీపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026: సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏ కీలక భేటీ.. 40 శాతం వాటా కోరుతున్న జనసేన!
-
The Raja Saab : సంక్రాంతి విలన్.. రాజా సాబ్ పోస్ట్ మార్టం ఫెయిల్?
-
Farmer Relief: కరువు వేళ రైతులకు దీపావళి కానుక.. ప్రతి రైతు ఖాతాలో రూ.5,000..!
-
RC 17: సైలెంటుగా సుకుమార్ – చరణ్ సినిమా ఓపెనింగ్.!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!