ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ రాజకీయం నడుస్తోంది. అందునా తిరుపతి జిల్లాలో అటు చంద్రబాబు, ఇటు పెద్దిరెడ్డి వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి లోకేష్, చంద్రబాబుపై మండిపడ్డారు. ఎంత సేపు మంత్రి శ్రీ పెద్దిరెడ్డిపై లోకేష్ బురద జల్లుతున్నారు. అసలు మాఫియాను ప్రారంభించింది చంద్రబాబు నాయుడన్నారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.
చంద్రబాబును వెన్నుపోటు దారుడు అంటారు…. పెద్దిరెడ్డి ని పెద్దాయన అంటారు. పది మందికి మంచి చేస్తే పెద్దాయన అని పిలుస్తారు. చంద్రగిరిలో పెద్దిరెడ్డి గుడి కట్టిస్తే…. మీ నాన్న కింద రాళ్ళు తవ్వుకున్నారు. చిత్తూరు డెయిరీని హెరిటేజ్ కోసం నాశనం చేసింది మీరు కాదా? పెద్దిరెడ్డి వద్దు అనుకుంటే హెరిటేజ్ కి పాలు పోసే వారా? పెద్దాయన ఎప్పుడు అలా చెప్పే వ్యక్తి కాదు. పది మందికి సహాయం చేసే వ్యక్తిని ఎర్ర చందనం మాఫియా అని మాట్లాడడం సిగ్గు చేటు. కుప్పంలో ఓడిపోతున్నాం అనే బాధతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
లోకేష్ స్థాయి తెలుసుకుని, పెద్దిరెడ్డిపై విమర్శలు చేయాలి. పెద్దిరెడ్డి కుటుంబం కష్టపడి పైకి వచ్చింది. మీ నాన్న లాగా అడ్డదిడ్డంగా ఎదగలేదు. మీరు ఇచ్చిన మ్యానిఫెస్టోలో ఏమైనా చేశారా? మా మేనిఫెస్టో లో దాదాపు అన్ని పూర్తి చేశాం. రాష్ట్రంలో పనికిరాని వారు ఎవరైనా ఉన్నారా అంటే అది లోకేష్ మాత్రమే. సంస్కారం, మర్యాద రెండు లోకేష్ కి తెలియదు. హెరిటేజ్ లో రకరకాల రేట్లతో ప్రజలను మోసం చేస్తున్న ఘనత చంద్రబాబుది అన్నారు.
Ayman Al Zawahiri: ఎవరీ అయమన్ అల్ జవహరి.. తర్వాత అతని వారసుడెవరు?