Narasaraopeta Telugu Desam Party : ఆ పార్టీలో ప్రచార ఆర్భాటం పార్టీ పేదల పరువు పోగొట్టిందా.?బొక్కబోర్లా పడ్డారా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narasaraopeta Telugu Desam Party :
పల్నాడు జిల్లాలో టిడిపి నేతలు సొంత ప్రాపకానికి ప్రాధాన్యం ఇస్తున్నారా? ప్రచార ఆర్భాటం పార్టీ పెద్దల పరువు పోగొట్టిందా? వాస్తవాలు తెలుసుకోకుండా దూకుడుగా వెళ్లి బొక్క బోర్లా పడ్డారా? తాజా ప్రయత్నం ఎందుకు బెడిసి కొట్టింది? పార్టీ పెద్దల రియాక్షన్ ఏంటి?
Also Read
టీడీపీకి చెందిన మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై హత్యాయత్నం పల్నాడు రాజకీయాలను వేడెక్కించింది. అది అధికారపార్టీ నేతల పనే అని టీడీపీ ఆరోపించడంతో రెండు వర్గాలు మధ్య మాటలు.. ట్వీట్లు హోరెత్తాయి. ఈ విషయంలో నరసరావుపేట టీడీపీ నేతలు చేసిన పని రివర్స్ కొట్టడంతో అంతా కంగుతిన్నారట. బాలకోటిరెడ్డిపై దాడి చేసింది సొంత బంధువు కావడం.. అతను కూడా టీడీపీ కార్యకర్తే అవడంతో అందరికీ దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట. ఈ క్రమంలో జరిగిన పరిణామాలు.. అధినేతల జోక్యం టీడీపీ శిబిరంలోనూ పెద్ద చర్చకు దారితీసినట్టు చెబుతున్నారు.
దాడి గురించి తెలియగానే జిల్లాకు చెందిన కొందరు టీడీపీ నేతలు హడావిడి చేయడంతో పార్టీ అధిష్ఠానం రంగంలోకి దిగింది. అధికారపార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ నాయకులు. కానీ.. అసలు విషయం తెలిసిన తర్వాత ఒకరి ముఖం ఒకరు చూసుకున్న పరిస్థితి. ఈ సమస్యపై టీడీపీలోనూ పోస్టుమార్టం జరుగుతోందట. ఇదంతా సొంత పార్టీలోని వ్యవహారమైతే.. తప్పుదోవ పట్టించింది ఎవరు? ఎందుకు ఇంత హంగామా చేశారు? గోటితో పోయేదాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఎందుకు? అని ఆరా తీస్తున్నారట.
టీడీపీ వ్యూహకర్తగా ఉన్న రాబిన్ సింగ్ సైతం ఫీల్డ్ ఎంట్రీ ఇచ్చినట్టు సమాచారం. ఎక్కడ తప్పు జరిగింది? దానికి కారకులు ఎవరు అనే దానిపై సమాచారం సేకరించి టీడీపీ పెద్దలకు ఆయన నివేదించారట. దెబ్బలు తగిలిన వ్యక్తి స్పృహలో ఉన్నప్పటికీ.. ఆయనతో పార్టీ నేతలు మాట్లాడలేదట. అప్పుడే దాడి చేసింది ఎవరో కోటిరెడ్డిని అడిగి ఉంటే ఇంత జరిగేది కాదని తేల్చారట. కానీ.. టీడీపీ సోషల్ మీడియాలోని కొందరు ప్రతినిధులు.. నరసరావుపేటకు చెందిన టీడీపీ నేతలు మరికొందరు అత్యుత్సాహం ప్రదర్శించారట. అంతా కలిసి జిల్లా నేతలను.. చంద్రబాబును, లోకేష్‌ను తప్పుదోవ పట్టించారని గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.
టీడీపీ అధిష్ఠానం చాలా సీరియస్‌గా ఉందని తెలుసుకున్న తెలుగు తమ్ముళ్లు.. అక్కడ నుంచి తీసుకునే చర్యలపై ఆందోళన చెందుతున్నారట. అందరి నుంచీ సమాచారం సేకరించి.. విషయాలను వడపోసిన తర్వాత బాధ్యులపై క్రమశిక్షణ తీసుకోవాలనే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నారట. ఈ అంశంలో ఫుల్ క్రెడిట్ కొట్టేద్దామని భావించిన పల్నాడు టీడీపీ నేతలు మాత్రం అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అని ఆందోళన చెందుతున్నారట. మరి టీడీపీ పెద్దలు ఏం చేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
-
Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
-
Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?