ఆ ఇద్దరు ఎంపీలు తమ నియోజకవర్గాల్లో అడుగు పెట్టాలంటే ఏంట్రీ పాస్ కావాల్సిందేనా? ఆ ఇద్దరు సీనియర్స్ ప్రమేయం లేకుండా ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేకపోతున్నారా? సీనియర్ మినిస్టర్స్ జూనియర్ ఎంపీలను తొక్కేస్తున్నారన్నది నిజమేనా? మరి ఎంపీలు కనీసం క్యాంప్ ఆఫీస్ ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు? ఎవరా మంత్రులు, ఎంపీలు? జనం ఓట్లేసి గెలిపించారు. కానీ… ఇప్పుడు వాళ్ళకే దూరమైపోతున్నామంటూ తెగ ఫీలైపోతున్నారట నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. నియోజకవర్గాల్లో అభివృద్ధి,…
Miss World 2025 : మిస్ వరల్డ్ – 2025 పోటీల్లో పాల్గొంటున్న ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు బుద్ధపూర్ణిమ సందర్భంగా సోమవారం నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక పర్యటనలో మొత్తం 30 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ పోటీదారులు పాల్గొననుండగా, వీరిలో ఎక్కువమంది ఆసియా దేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు. బౌద్ధమతంపై గల విశ్వాసం, బుద్ధుని చరిత్రపై ఆసక్తితో, ఈ సుందరీమణులు బౌద్ధ థీమ్ పార్క్‌లోని మహాస్థూపం వద్ద ప్రత్యేక ధ్యాన…
Ponguleti Srinivasa Reddy: నల్లగొండ జిల్లా నకిరేకల్ MPDO కార్యాలయంలో ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల సామేలు, బత్తుల లక్ష్మారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినా ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సన్న బియ్యంతో…
మూల విరాట్‌కే దిక్కులేక ఓ మూలన ఉంటే…. ఉత్సవ విగ్రహం వచ్చి ఊరేగింపు ఎప్పుడని అడిగిందన్నది సామెత. ఇప్పుడక్కడ కారు పార్టీ పరిస్థితి అచ్చుగుద్దినట్టు అలాగే ఉందట. పార్టీలోకి ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా… పాదయాత్ర చేశామా? లేదా? అన్నదే ముఖ్యం అంటూ కొందరు జూనియర్స్ చెలరేగిపోతుంటడం ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. సమ్మర్ సెగల్ని మించిన రేంజ్‌లో వర్గపోరు ఎక్కడ జరుగుతోంది? ఏంటా కథ? ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ లీడర్స్ కొందరు కడుపులో కత్తులు పెట్టుకొని తిరుగుతున్నారట. ప్రేమగా…
తాను మంత్రి పదవి కోసం ఢిల్లీలో పైరవీలు చేయనని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. ఖమ్మంలో 9 మంది గేలిస్తే 3 మంత్రి పదవులు వచ్చాయని తెలిపారు. మరి నల్లగొండలో 11 స్థానాలు గెలుస్తే మంత్రి పదవులు రెండేనా? అన్నారు.
Jagadish Reddy : నల్లగొండ జిల్లా రాజకీయ వేడిని మరోసారి పెంచుతూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులపై తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా వ్యవసాయ రంగం దుర్దశను ఎదుర్కొంటోందని ఆయన ఆరోపించారు. ఇప్పటివరకు పంటలకు బోనస్ ఇవ్వకపోవడం, రుణమాఫీ అంశం పూర్తిగా మర్చిపోయిన పరిస్థితి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ప్రస్తుత మంత్రులు ప్రజాసమస్యలను పట్టించుకోకుండా కేవలం కమిషన్లకే పరిమితమయ్యారని, దళారులకు…
Minister Komatireddy: నల్లగొండ జిల్లాలో పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎన్టీవీతో మాట్లాడుతూ.. కేటీఆర్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు.. పార్లమెంట్ స్థానాల్లో డిపాజిట్ లు కోల్పోయారు అని మండిపడ్డారు.
Congerss Minister : సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్ పహాడ్ వద్ద మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణలో సన్న బియ్యం పంపిణీ, నల్లగొండ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలు, కాంగ్రెస్ భవిష్యత్ లక్ష్యాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, “తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఏప్రిల్ నెల…
నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడుగా నాగం వర్షిత్ రెడ్డి నియామకం కమల దళంలో కల్లోలం రేపుతోందట. నియామకం తర్వాత రేగిన అసమ్మతి జ్వాలల్ని ఆర్పేందుకు అధిష్టానం ఎంతగా ప్రయత్నిస్తున్నా... తిరిగి ఎక్కడో ఒక చోట రేగుతూనే ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న వర్షిత్ రెడ్డి మొదటి నుండి క్యాడర్‌ను కలుపుకుని పోవడం లేదని, ఏకపక్ష నిర్ణయాలతో చేటు చేస్తున్నారన్నది ఆయన వ్యతిరేకుల ప్రధాన ఆరోపణ.
Off The Record: అంతా మీరే చేశారు.. ఇదో పాపులర్ సినిమా డైలాగ్. అంతా వాళ్లే చేస్తున్నారు. అన్నీ వాళ్ళకేనా? ఇవి తెలంగాణ కాంగ్రెస్‌లో పాపులర్ అవుతున్న క్వశ్చన్స్. వడ్డించే వాడు మనవాడైతే వెనక బంతిలో కూర్చున్నా ఫరవాలేదన్న సామెత ఆ ఉమ్మడి జిల్లా నేతలకు అచ్చుగుద్దినట్లు వర్తిస్తుందని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు.